చిత్రం చెప్పే విశేషాలు
(30-03-2024/2)
ఎన్నికల ప్రచారంలో భాగంగా తెదేపా ఆధ్వర్యంలో ప్రొద్దుటూరులో ‘ప్రజాగళం’ ప్రచారయాత్ర నిర్వహించారు. చంద్రబాబు హాజరై ప్రసంగించారు.
దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘భారతరత్న’ ప్రదానోత్సవం దిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో శనివారం నిర్వహించారు. దివంగత మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు తరఫున ఆయన కుమారుడు ప్రభాకర్‌రావు ఈ పురస్కారాన్ని ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా స్వీకరించారు.
జీహెచ్‌ఎంసీ మేయర్ జి.విజయలక్ష్మి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపాదాస్ మున్షీ సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
హీరో నిఖిల్ సిద్ధార్థ్ తెదేపాలో చేరారు. లోకేశ్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్.. పిఠాపురం తెదేపా ఇన్‌ఛార్జి వర్మ ఇంట్లో భోజనానికి వెళ్లారు. నాయకులు, కార్యాకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు.
ఈస్టర్ ఫెస్టివల్ సందర్భంగా కరీంనగర్‌లో రన్ ఫర్ జీసస్ ర్యాలీ నిర్వహించారు. క్రైస్తవుల సోదరులు, యువతులు పెద్దఎత్తున ర్యాలీ తీశారు.
తెలంగాణలో పదో తరగతి పరీక్షలు శనివారంతో ముగిశాయి. దీంతో పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థులు కేరింతలు కొడుతూ కనిపించారు.
హీరో నితిన్, డైరెక్టర్ శ్రీరామ్ వేణు కాంబినేషన్‌లో రాబోతున్న చిత్రం ‘తమ్ముడు’. శనివారం నితిన్ పుట్టిన రోజు సందర్భంగా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది.