చిత్రం చెప్పే విశేషాలు

(31-03-2024/2)

భాజపా అగ్రనేత, మాజీ ఉపప్రధాని లాల్‌కృష్ణ ఆడ్వాణీకి అత్యున్నత పౌర పురస్కారం ‘భారత రత్న’ను ప్రదానం చేశారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆదివారం స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి అవార్డు అందజేశారు.

పిఠాపురంలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. అందలో భాగంగా పలు ఆలయాల్లో ఆయన ప్రత్యేకపూజలు నిర్వహించారు.

తెదేపా ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్నూలులో ‘ప్రజాగళం’ ప్రచార యాత్రను నిర్వహించారు. పార్టీ అధినేత చంద్రబాబు హాజరై ప్రసంగించారు.

తిరుమల శ్రీవారిని ‘పారిజాత పర్వం’ చిత్రబృందం దర్శించుకుంది. వీరికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. 

భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ జనగామ, సూర్యాపేట జిల్లాల్లో ఎండిపోయిన పంటలను పరిశీలించారు. అనంతరం రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 

ఆదివారం ఈస్టర్‌ పర్వదినం సందర్భంగా రాష్ట్రంలోని పలు చర్చిల్లో సందడి వాతావరణం నెలకొంది. క్రైస్తవులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రార్థనలు చేశారు. 

భారాస ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కావ్య కాంగ్రెస్‌లో చేరారు. సీఎం రేవంత్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపాదాస్‌ మున్షీ వారికి కండువా కప్పి ఆహ్వానించారు. 

విశాఖపట్నంలో అభిమానులకు మరోసారి ఐపీఎల్‌ మజా మొదలైంది. విశాఖలోని వైఎస్సార్‌ స్టేడియంలో దిల్లీ, చెన్నై జట్ల మధ్య మ్యాచ్‌ జరుగుతోంది. స్టేడియం వద్ద అభిమానుల సందడి నెలకొంది.

చిత్రం చెప్పేవిశేషాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు

Eenadu.net Home