చిత్రం చెప్పే విశేషాలు

(01-04-2024/3)

ఐపీఎల్ 17 సీజన్‌లో భాగంగా ముంబయితో రాజస్థాన్‌ తలపడుతోంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ముంబయి పాయింట్ల ఖాతా తెరవలేదు. ముంబయి టీం బ్యాటింగ్‌ చేస్తోంది.

అగ్ర కథానాయకుడు చిరంజీవి, ‘టిల్లు స్క్వేర్‌’ చిత్రబృందాన్ని అభినందించారు. అందరూ చూడాల్సిన చిత్రమని పేర్కొన్నారు.

అబిడ్స్‌లోని ఓ ఫుట్‌వేర్‌ స్టోర్‌లో నటీమణులు, మోడల్స్‌ మెరిశారు. నటి స్రవంతి చొక్కారపు, మిస్‌ ఇండియా తెలంగాణ-2023 ఊర్మిళా చౌహాన్‌, ఫ్యాషన్ ప్రియులు స్టోర్‌లో ఫొటోలకు పోజులిచ్చి సందడి చేశారు. 

విజయ్‌ దేవరకొండ - మృణాల్‌ ఠాకూర్ జంటగా నంటించిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్‌’. దిల్‌రాజు నిర్మాత. ఈ చిత్రం ఏప్రిల్‌ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సోమవారం హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్‌ నిర్వహించారు. 

మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌ జనసేనలో చేరారు. పిఠాపురంలో జరిగిన కార్యక్రమంలో ఆయనకు కండువా కప్పి జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ పార్టీలోకి ఆహ్వానించారు.

నల్గొండ లోక్‌సభ నియోజకవర్గ భారాస విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. అనంతరం కేటీఆర్‌ ప్రజల దగ్గరికి వెళ్లి వారి సమస్యలను తెలుసుకున్నారు. 

 విశాఖపట్నం జిల్లా ఆనందపురం కూడలి సమీపంలో ఓ ఇంటిపై వేసిన తివాచీపై పూలు వికసించాయి. ఆ దారిలో వెళ్లే వారికి కనువిందు చేస్తోంది. 

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఈ క్రమంలో ఓ రైతు ఎండ తీవ్రతకు మామిడి కాయలు రాలుతున్నాయని వాటికి పాలీ కవర్లను ఏర్పాటు చేశారు. దీంతో ఎండతీవ్రతకు కాయలు వాడిపోకుండా ఉంటున్నాయి. 

చిత్రం చెప్పేవిశేషాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు

Eenadu.net Home