చిత్రం చెప్పే విశేషాలు

(02-04-2024/1)

ఎండ తీవ్రత పెరుగుతుండటంతో చల్లని నీటి కోసం మట్టి కుండ పాత్రలను వాడతారు. కూకట్‌పల్లిలో రకరకాల కుండ పాత్రలు దుకాణాల్లో దర్శనమిస్తున్నాయి.

ఒడిశా సోమవారం 89వ వసంతంలోకి ఉత్కళ జననీ అడుగుపెట్టింది. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రముఖ శిల్పి సుదర్శన్‌ పట్నాయక్‌ పూరీ తీరంలో సైకత శిల్పం తీర్చి దిద్ది రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. 

దేవలమ్మనాగారంలోని పురాతన చెరువులో నీళ్లు ఉండడంతో ఎక్కడెక్కడి నుంచో గొర్రెల మందలు దాహార్తి తీర్చుకునేందుకు వస్తున్నాయి. వర్షాలు లేక చెరువు ఎండిపోయి ఇలా కనిపిస్తోంది. 

బేగంపేట మెట్రోస్టేషన్‌ పైవంతెన రోడ్డులో.. సోమవారం మిట్ట మధ్యాహ్నం ఎండలో ఓ బొమ్మ విధులు నిర్వహిస్తూ కనిపించింది. చాలా మంది నిజంగా మనిషి అనుకుని ఆశ్చర్యానికి గురయ్యారు. 

 ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతమ్‌ అదానీ తన మనవరాలితో దిగిన ఫొటోను ఎక్స్‌లో పంచుకున్నారు. ‘‘నీ చూపుల్లోని వెలుగు ముందు ప్రపంచంలోని సంపద అంతా వెలవెలబోయే’’అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఇది వైరలవుతోంది.  

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఉగాదిని పురస్కరించుకుని మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనాన్ని శాస్త్రోక్తంగా చేపట్టారు. తితిదే ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి, ఈవో ఏవీ ధర్మారెడ్డి కార్యక్రమంలో పాల్గొన్నారు. 

కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్‌ నాలుగో రోజు పర్యటిస్తున్నారు. స్థానిక ఆంధ్రా బాప్టిస్ట్‌ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. 

శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి అయోధ్యకు తొలి విమాన సర్వీసు ప్రారంభమైంది. 

చిత్రం చెప్పే విశేషాలు (12-04-2024/2)

చిత్రం చెప్పే విశేషాలు(12-04-2024/1)

నానో న్యూస్‌ (12/ 04/ 2024)

Eenadu.net Home