చిత్రం చెప్పే విశేషాలు

(02-04-2024/2)

ఐపీఎల్ 17 సీజన్‌లో భాగంగా బెంగళూరు, లఖ్‌నవూ మధ్య మ్యాచ్‌ జరుగుతోంది. బెంగళూరు కెప్టెన్ డుప్లెసిస్‌ టాస్‌ గెలిచి ప్రత్యర్థి జట్టుని బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. 

 పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అంబర్‌పేట్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా పలువురిని పలకరించారు.

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప: ది రూల్‌’. బన్నీ పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్‌ 8న టీజర్‌ విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. 

దిల్లీ జట్టు శ్రీకాకుళం జిల్లాలోని రాజాంలో సందడి చేసింది. జీఎంఆర్‌ఐటీ క్యాంపస్‌లో విద్యార్థులతో దిల్లీ ఆటగాళ్లు సెల్ఫీలు దిగి ముచ్చటించారు.

కాంగ్రెస్‌ అధిష్ఠానం షర్మిలకు కడప ఎంపీ టికెట్‌ కేటాయించింది. ఈ సందర్భంగా ఇడుపుల పాయల వద్ద వైఎస్సార్‌ సమాధి వద్ద నివాళులర్పించారు.

సికింద్రాబాద్‌ ప్రాంతంలో చెట్టుకు ఖాళీ బిందెలతో లైట్లు ఏర్పాటు చేయడం ఆసక్తికరంగా ఉంది. వేసవి కాలంలో ప్రజలు చెట్ల కింద సేదతీరడానికి ఇలా ఏర్పాటు చేసినట్లు తెలసుస్తోంది.

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పిఠాపురంలోని యు.కొత్తపల్లి మండలం పొన్నాడలో బషీర్‌ బీబీ దర్గాకు వెళ్లారు. అనంతరం ఉప్పాడ కొత్తపల్లిలో మహిళలతో సమావేశం నిర్వహించారు.

అజయ్‌ దేవగణ్‌ ఫుట్‌బాల్‌ దిగ్గజ కోచ్‌ సయ్యద్‌ అబ్దుల్‌ రహీంగా నటిస్తున్న చిత్రం ‘మైదాన్‌’. ప్రియమణి హీరోయిన్‌. మంగళవారం అజయ్‌ దేవగణ్‌ పుట్టినరోజు సందర్భంగా ఫైనల్‌ ట్రైలర్‌ను విడుదల చేశారు.

జిమ్‌.. జామ్‌..

చిత్రం చెప్పే విశేషాలు..(21-04-2024)

హైదరాబాద్‌ ఆటగాళ్ల సంబరాలు చూశారా!

Eenadu.net Home