చిత్రం చెప్పే విశేషాలు

(03-04-2024/2)

 కేరళలోని వయనాడ్‌లో కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ సందర్భంగా రోడ్‌ షో నిర్వహించారు.

తైవాన్‌ను భారీ భూకంపం అతలాకుతలం చేసింది. తైవాన్‌ కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 8 గంటల సమయంలో ఈ విపత్తు సంభవించింది.

చిత్తూరు జిల్లాలోని పూతలపట్టులో బుధవారం వైకాపా నిర్వహిస్తున్న ‘మేమంతా సిద్ధం’ సభ కోసం ఆర్టీసీ యాజమాన్యం బస్సులను కేటాయించింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

అల్లు అర్జున్‌ కుమారుడు అల్లు అయాన్‌ పుట్టిన రోజు సందర్భంగా పలువురు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అల్లు అర్జున్‌ కుమారుడితో దిగిన ఫొటోలను సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. 

సినీ నటి జయప్రద తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వీరికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు.

విశాఖలో ఓ వస్త్ర దుకాణం ప్రారంభోత్సవానికి ప్రముఖ టీవీ యాంకర్‌ శ్రీముఖి హాజరయ్యారు. ఆమెను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు.

సినీనటుడు ప్రభుదేవా పుట్టిన రోజు సందర్భంగా హీరో మంచు విష్ణు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఆయనతో దిగిన ఫొటోను షేర్‌ చేశారు. 

తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్‌ విందుకు మాజీ మంత్రి కేటీఆర్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులతో సరదాగా ముచ్చటించారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా తెదేపా ఆధ్వర్యంలో కోనసీమ జిల్లాలోని కొత్తపేటలో ‘ప్రజాగళం’ ప్రచార యాత్ర నిర్వహించారు. అధినేత చంద్రబాబు హాజరై ప్రసంగించారు.

చిత్రం చెప్పేవిశేషాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు

Eenadu.net Home