చిత్రం చెప్పే విశేషాలు

(04-04-2024/2)

తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో తెదేపా ఆధ్వర్యంలో ‘ప్రజాగళం’ ప్రచార యాత్ర నిర్వహించారు. చంద్రబాబు హాజరై ప్రసంగించారు.

గచ్చిబౌలిలో ఓఘా వెల్‌నెస్ సెంటర్‌ను మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సినీనటి డింపుల్ హయాతి ప్రారంభించారు. పలువురు సినీ నటులు పాల్గొని సందడి చేశారు.

‘నిజం గెలవాలి’ యాత్రలో భాగంగా నారా భువనేశ్వరి కర్నూల్‌ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా పలు కుటుంబాలను పరామర్శించారు. 

యంగ్‌ హీరో నిఖిల్‌ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘స్వయంభూ’. సంయుక్త మేనన్‌ కథానాయిక. చిత్రంలో మరో కథానాయికగా నభానటేష్‌ నటిస్తోన్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.

కాంగ్రెస్‌ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ రాజ్యసభ సభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్‌ హాజరయ్యారు.  

ధర్మస్థల ధర్మాధికారి వీరేంద్ర హెగ్గడే పలు రకాల వింటేజ్‌, క్లాసిక్‌ కార్లను సేకరించుకుంటూ వస్తున్నారు. ఆ కార్లను ధర్మస్థలంలోని ‘మంజూష’లో ప్రదర్శనకు ఉంచారు. 

సంగారెడ్డి జిల్లా చందాపూర్‌లోని ఎస్బీ ఆర్గానిక్స్ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో గాయపడిన వారిని మాజీ మంత్రి హరీశ్‌ రావు పరామర్శించారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. 

ఐపీఎల్ 17 సీజన్‌లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా గుజరాత్‌తో పంజాబ్‌ తలపడుతోంది. టాస్ ఓడి గుజరాత్ బ్యాటింగ్‌కు దిగింది.

చిత్రం చెప్పేవిశేషాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు

Eenadu.net Home