చిత్రం చెప్పే విశేషాలు

(06-04-2024/1)

సినీ నటి శ్రీలీల శుక్రవారం కడపలో సందడి చేశారు. ఓ జ్యూవెలరీ షోరూమ్‌ను ఆమె ప్రారంభించారు. శ్రీలీలను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. అభిమానులతో కలిసి ఆమె సరదాగా స్టెప్పులేశారు.

హనుమకొండ జిల్లాలోని చారిత్రక శైవక్షేత్రం ఐనవోలు మల్లికార్జునస్వామి ఆలయం కొత్త శోభను సంతరించుకుంది. ఓ దాత రూ.13 లక్షలతో ఇత్తడి తొడుగు, బంగారుపూతతో గర్భాలయాన్ని సుందరంగా తీర్చిదిద్దారు.

చిత్తూరు జిల్లా పుత్తూరులో జరిగిన ఓ కార్యక్రమంలో సినీ నటి నిధి అగర్వాల్‌ తళుక్కున మెరిశారు. విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు.

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓటరు అవగాహన కోసం విజయవాడలోని బెంజిసర్కిల్‌ వద్ద నిలువెత్తు ఈవీఎం నమూనాను ఏర్పాటు చేశారు. 

సిద్దిపేటలో కోతులను తరిమేందుకు మహారాష్ట్ర నుంచి గన్‌లను తీసుకుని వచ్చి విక్రయిస్తున్నారు. గన్‌లో ఓ పదార్థం నింపి బటన్‌ నొక్కితే నిప్పు కణిక తోడై, పొగ వచ్చి.. కోతులు భయపడి పారిపోయేలా శబ్దం వస్తుంది. వీటిని ప్రజలు కొనుగోలు చేసి కోతులపై ప్రయోగిస్తున్నారు.

ఉప్పల్‌లో క్రీడాభిమానులు ఉప్పెనలా తరలివచ్చారు. మెట్రో రైళ్లు, బస్సులు కిటకిటలాడాయి. శుక్రవారం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌-చెన్నై సూపర్‌ కింగ్స్‌ మధ్య మ్యాచ్‌ జరిగింది. సీఎం హోదాలో  తొలిసారిగా స్టేడియానికి వచ్చిన ఆయనతో అభిమానులు సెల్ఫీ దిగారు. 

జలాశయాలన్నీ ఓటుకుండలైన నేపథ్యంలో కర్ణాటక రాష్ట్రంలోని ఉద్యాననగరిలో నీటి కష్టాలు తప్పడం లేదు. పలు ప్రాంతాల్లో తాగునీటికి కొరత కొనసాగుతోంది. నాగరబావి వలయ వర్తుల రహదారిలో ఒక కార్మికురాలు రెండు బిందెలలో నీటిని నింపుకొని.. భారంగా వెళ్తోంది. ఈ చిత్రం నీటి సమస్యకు అద్దం పడుతుంది. 

హైదరాబాద్‌లోని అమీర్‌పేట - బేగంపేట రోడ్డులో ఆటో ట్రాలీలో ఉంచిన తోపుడు బండిపై ఓ చిరు వ్యాపారి నీడ పట్టున కూర్చొని ప్రయాణం సాగిస్తున్న చిత్రమిది.

హనుమకొండలోని అంబేడ్కర్‌ కూడలి సమీపంలో సరిగ్గా రెండు వారాల క్రితం ఆకులు లేక ఎండిపోయినట్లు ఉన్న ఈ వృక్షం.. ప్రస్తుతం మళ్లీ చిగురించి కొత్త కళ సంతరించుకుంది. పచ్చని ఆకులతో తిరిగి జీవం పోసుకుంది. 

చిత్రం చెప్పేవిశేషాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు

Eenadu.net Home