చిత్రం చెప్పే విశేషాలు

(06-04-2024/2)

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్.. తెలంగాణ నుంచి ఎన్నికల సమర శంఖాన్ని పూరించింది. ఈ సందర్భంగా తుక్కుగూడలో ‘జనజాతర’ సభ ఏర్పాటు చేశారు. కాంగ్రెస్‌ నేత రాహుల్ గాంధీ ఈ సభలో ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. 

 తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు రెండో రోజు వైభవంగా కొనసాగాయి. చిన్నశేషవాహనంపై స్వామివారు భక్తులకు అభయమిచ్చారు.

పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్‌ బాబు వైకాపాను వీడి కాంగ్రెస్‌లో చేరారు. ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 

నటుడు, దర్శకుడు రవిబాబు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వీరికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. 

కర్నూలు జిల్లాలోని నంద్యాలలో ముస్లిం సోదరీమణులతో నారా భువనేశ్వరి మాటామంతీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భువనేశ్వరి వారితో కాసేపు ముచ్చటించారు.

ఉపాధి కరువై అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న సిరిపురం లక్ష్మీనారాయణ పార్థివదేహానికి సిరిసిల్ల ఏరియా ఆసుపత్రిలో మాజీ మంత్రి కేటీఆర్‌ నివాళులర్పించారు. వారి కుటుంబీకులను పరామర్శించారు.

హైదరాబాద్‌లో ఎఫ్‌ఎన్‌సీసీ ఆధ్వర్యంలో ఆల్ ఇండియా ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌ను నటుడు నాగశౌర్య ప్రారంభించారు. ఈ సందర్భంగా కాసేపు టెన్నిస్‌ ఆడారు. 

సినీ నటి మీనాక్షి చౌదరి శనివారం హైదరాబాద్‌లో సందడి చేశారు. పంజాగుట్టలోని ఓ బంగారు ఆభరణాల షోరూమ్‌ను ప్రారంభించారు. 

చిత్రం చెప్పేవిశేషాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు

Eenadu.net Home