చిత్రం చెప్పే విశేషాలు

(07-04-2024/2)

భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్‌లో చేరారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, మంత్రి పొంగులేటి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 

ఐస్‌ల్యాండ్‌లోని ఓ అగ్నిపర్వతం బద్దలైంది. ఈమధ్య కాలంలో అగ్నిపర్వతం మూడు సార్లు బద్దలైనట్లు అధికారులు తెలిపారు. పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

పొద్దుతిరుగుడు పూలు కోత దశకు వచ్చే సరికి పూలలోని నల్లగింజలను పక్షులు తినేస్తున్నాయి. దీంతో పక్షల నుంచి రక్షణగా ప.గో. జిల్లా ఉంగుటూరు మండలం గొల్లగూడెంలోని పొలాల్లో పొద్దుతిరుగుడు పూలకు ఇలా గోనె సంచులను చుట్టారు.

హీరో రామ్‌ చరణ్‌-ఉపాసన దంపతులు ఇటీవల థాయ్‌లాండ్‌ పర్యటనకు వెళ్లి వచ్చారు. తాజాగా ఈ చిత్రాలను ఉపాసన సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. నెట్టింట ఇవి వైరల్‌గా మారాయి. 

వాంఖడే మైదానంలో ముంబయి, దిల్లీ జట్ల మధ్య మ్యాచ్‌ జరిగింది. ముకేశ్‌ అంబానీ సతీమణి నీతా అంబానీ స్టేడియంలో ప్రేక్షకులతో కలిసి మ్యాచ్ వీక్షించారు. 

శ్రీశైలం మహాక్షేత్రంలోఉగాది మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తొలి రోజు శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారు భృంగి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.

ఇజ్రాయెల్‌- హమాస్‌ యుద్ధానికి నేటి (ఏప్రిల్‌ 7)తో ఆరు నెలలు పూర్తయింది. గాజాలో 33 వేలమంది ప్రాణాలు కోల్పోవడం, పాలస్తీనీయుల వెతలు.. యావత్‌ ప్రపంచాన్ని కలవరపెడుతున్నాయి.

అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘పుష్ప: ది రూల్‌’. సోమవారం అల్లు అర్జున్‌ పుట్టినరోజు సందర్భంగా ఉదయం 11.07 గంటలకు టీజర్‌ను విడుదల చేయనున్నట్లు చెబుతూ చిత్రబృందం సరికొత్త పోస్టర్‌ను పంచుకుంది.

అనకాపల్లిలో జనసేన ఆధ్వర్యంలో వారాహి విజయ భేరి యాత్ర నిర్వహించారు. పవన్‌ కల్యాణ్‌ హాజరై ప్రసంగించారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా పామర్రులో తెదేపా ఆధ్వర్యంలో ‘ప్రజాగళం’ ప్రచార యాత్ర నిర్వహించారు. చంద్రబాబు హాజరై ప్రసంగించారు.

చిత్రం చెప్పేవిశేషాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు

Eenadu.net Home