చిత్రం చెప్పే విశేషాలు
(09-04-2024/1)
ఉత్తర అమెరికాలో సోమవారం సంపూర్ణ సూర్యగ్రహణం కనువిందు చేసింది. మెక్సికో, అమెరికా, కెనడాలో నిర్దిష్ట ప్రదేశాల్లో ఈ ఖగోళ అద్భుతాన్ని వీక్షించేందుకు ప్రజలు ఇతర ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చారు.
ఐపీఎల్ ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టు పెట్టింది.
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌కు చెందిన పత్ర చిత్రకారుడు గుండు శివకుమార్ తెలుగు సంస్కృతికి అద్దంపట్టేలా మర్రి ఆకులపై మామిడి కాయ, కోయిల చిత్రాలను మలిచారు.
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం చేబ్రోలులో నిర్వహించిన ఉత్సవాలకు సోదరుడు నాగబాబు, జనసేన నేతలతో కలిసి హాజరయ్యారు.
ఉగాది సందర్భంగా మాస్ హీరో రవితేజ కొత్త చిత్రాన్ని ప్రకటించారు. ‘RT75’ పేరుతో దీని పోస్టర్‌ను విడుదల చేశారు.
ఇటీవల్ ‘ఫ్యామిలీ స్టార్’ ప్రమోషన్స్‌లో ఓ అభిమాని.. దివ్యాంగురాలైన తన చెల్లి ఫ్యామిలీని చూసుకుంటుందని దిల్‌రాజుతో పేర్కొన్నారు. దీంతో దిల్ రాజు ఆమెను కలుస్తానని చెప్పారు. దాని ప్రకారం ఆ అభిమాని ఇంటికి ఫ్యామిలీ స్టార్ చిత్రబృందమంతా వెళ్లి సర్‌ప్రైజ్ చేసింది.
ఉగాది పర్వదినం సందర్భంగా భద్రాద్రి రాముల వారి ఆలయం సరికొత్త శోభను సంతరించుకుంది. రాత్రి సమయంలో విద్యుత్ కాంతులతో ఇలా కనువిందు చేస్తోంది.
తిరుమల శ్రీవారి ఆలయంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఫల, పుష్ప అలంకరణలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. తితిదే ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో పది టన్నుల పూలు, ఫలాలను వినియోగించి అలంకరణలు చేపట్టారు.