చిత్రం చెప్పే విశేషాలు
(09-04-2024/2)
తెదేపా కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. చంద్రబాబు హాజరయ్యారు. ఆయనకు వేదపండితులు ఆశీర్వచనం చేశారు.
ముచ్చింతల్ స్వర్ణ భారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ తదితరులు పాల్గొన్నారు.
ఉగాది సందర్భంగా నాని తన కొత్త సినిమా ‘సరిపోదా శనివారం’ విడుదల తేదీని ప్రకటించారు. ఈ ఏడాది ఆగస్టు 29కి చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం పోస్టర్ ఆధారంగా తెలియజేసింది.
జమ్మూలో నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అక్కడి పురాతన బాబా సిద్ గోరియా ఆలయంలో ఇలా దీపాలు వెలిగించారు.
తమిళ నటుడు సంతానం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అధికారులు వీరిక ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు.
ఇజ్రాయెల్ సైనికులు ఇజ్రాయెల్- గాజా సరిహద్దు సమీపానికి చేరుకున్నారు. గాజాపై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. ఇజ్రాయెల్- హమాస్ యుద్ధానికి ఏప్రిల్ 7 వరకు ఆరు నెలలు పూర్తయ్యాయి.
ముంబయిలో గుడి పడ్వా (మరాఠీ నూతన సంవత్సరం)ను పురస్కరించుకుని మహిళలు సంప్రదాయ వస్త్రధారణలో ఊరేగింపు నిర్వహించారు. నృత్యాలు చేసి ఆకట్టుకున్నారు.
తెలంగాణ భవన్‌లో భారాస ఆధ్వర్యంలో ఉగాది వేడుకలను నిర్వహించారు. భారాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు, ఎంపీలు, తదితర నాయకులు పాల్గొన్నారు.