చిత్రం చెప్పే విశేషాలు

(11-04-2024/1)

వరంగల్‌ శ్రీభద్రకాళి దేవాలయంలో వసంత నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. రెండో రోజు బుధవారం లక్ష మల్లెలతో పుష్పార్చన నిర్వహించారు. ఉదయం సుప్రభాత సేవ, నిత్యాహ్నికం, నవరాత్రి విశేష పూజలు జరిగాయి. 

హైదరాబాద్‌ నగరంలో ఏ ఎన్నిక జరిగినా పోలింగ్‌ శాతం ఆశించిన స్థాయిలో నమోదు కావడం లేదు. ఈ నేపథ్యంలో ఓటర్లలో చైతన్యం తీసుకురావడానికి కొండాపూర్‌ బొటానికల్‌ గార్డెన్‌ ప్రాంగణంలో ఎన్నికల కమిషన్ ఈ బ్యాలెట్‌ నమూనాను ఏర్పాటు చేసింది. 

పవిత్రమైన రంజాన్‌ పండగ పురస్కరించుకొని రావి ఆకుపై మసీదు, చంద్రవంకను మెదక్‌ జిల్లా మనోహరాబాద్‌ ఉన్నత పాఠశాల చిత్రలేఖన ఉపాధ్యాయుడు బ్రహ్మచారి రూపొందించారు.

ఎండలు మండిపోతున్నాయి. ఇళ్లలోనూ ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వేడిని తట్టుకోవడానికి మధ్య తరగతి కుటుంబీకులు పాత కూలర్ల దుమ్ము దులుపుతున్నారు. సికింద్రాబాద్‌లో ఓ వ్యక్తి కూలర్‌కు మరమ్మతులు చేయించి తీసుకెళ్తూ కనిపించాడు. 

కల్లూరులోని చౌడేశ్వరి ఆలయం చుట్టూ గార్దబాల ప్రదక్షిణ అందరినీ ఆకట్టుకుంది. ఉగాది ఉత్సవాల్లో భాగంగా ఆలయం చుట్టూ పోసిన బురద మట్టిలో బుధవారం సాయంత్రం గాడిదలతోపాటు వృషభాలను తిప్పారు.

ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రధాన పార్టీలు ప్రజల్లోకి వెళ్లడానికి ప్రచార రథాలను సిద్ధం చేసుకుంటున్నాయి. హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు సమీపంలో ఎన్టీఆర్ గ్రౌండ్‌లో కాంగ్రెస్‌, బాజపా, భారాస అభ్యర్థులు సకల హంగులతో ప్రచార రథాలను చేయించుకుంటున్నారు.

ఓ ఆటోవాలా ట్రాలీపై ఒక బండి, వెనుక మరో బండిని కట్టుకుని రద్దీ దారిలో వెళ్తున్నాడిలా.. వెనుక తాడు తెగినా, ముందు వారు ఒక్కసారిగా బ్రేకు వేసినా ఇతరులకూ ప్రమాదకరమే. టోలిచౌకి- షేక్‌పేట ప్రధాన రహదారిపై కనిపించిన చిత్రమిది.

విశాఖపట్నం జిల్లా జి.గంగవరం పాలకేంద్రం వద్ద ఉన్న చెట్టుకు ఆకులు కనిపించకుండా, చెట్టాంత పువ్వులు విరబూసి ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంది. కొమ్మల నిండా గులాబీ వర్ణంలో పువ్వులు పూశాయి

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

Eenadu.net Home