చిత్రం చెప్పే విశేషాలు

(12-04-2024/2)

రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి శ్రీ ముఖేష్ కుమార్ మీనా సతీసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. 

వేసవి కాలం అంటే పక్షులకు హడలే.. చెట్లపైనే సేద తీరుతుంటాయి. ఎండ తీవ్రత తగ్గాక ఆకాశంలో హాయిగా విహరిస్తాయి. సూరీడు అస్తమిస్తుండగా పక్షులు ఇలా ఆకాశంలో స్వేచ్ఛగా విహరిస్తున్న దృశ్యాన్ని గురువారం హనుమకొండ జిల్లా రెడ్డిపురం సమీపంలోని కేసీ కెనాల్‌ వద్ద ‘ఈనాడు’ కెమెరాలో బంధించింది.

వైకాపా నేతలు పార్టీ ప్రచారానికి ప్రార్థనలనూ వదలడం లేదు. వైయస్‌ఆర్‌ జిల్లా కడపలో ఫ్యాన్‌ గుర్తున్న నీటి సీసాలు పంపిణీ చేసి.. ప్రచార యావను మరోసారి చాటుకున్నారు. స్థానిక జమీల్‌ మొబైల్స్‌ దుకాణ యాజమాన్యం ఈ స్టిక్కర్లున్న నీటి సీసాలను తయారు చేయించింది. 

చిత్తాపూర్‌లో రైతు రమేశ్‌కు రెండెకరాల నిమ్మతోట ఉంది. రెండు బోర్లు ఉండగా.. ఒకటి గత నెలలో, మరొకటి పది రోజుల క్రితం వట్టిపోయాయి. దీంతో ట్యాంకర్లతో ఒకసారి నీరందించే ప్రయత్నం చేశారు. అప్పటికే అన్ని ఖర్చులు కలిపి రూ.2 లక్షలు దాటడంతో ఇక చేతులెత్తేశారు. 

కోవైలో 100 శాతం పోలింగ్‌పై అవగాహన కల్పించడానికి జిల్లా యంత్రాంగం పలు అవగాహన కార్యక్రమాలు చేపడుతోంది. సుమారు 1000 మందికి పైగా విద్యార్థులు ఇండియా మ్యాప్‌ ఆకారంలో నిల్చుని అందరిని ఆకట్టుకున్నారు. 

ఇది గూడే.. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం మర్రితండా అటవీ ప్రాంతంలో వివిధ రకాలైన ఆకులతో చీమలు వాటి నివాసానికై అల్లుకున్నవే ఇవి.  చెట్టుకు పదుల సంఖ్యలో ఉన్న ఈ అందమైన గూళ్లు చూపరులను కట్టిపడేస్తున్నాయి. 

ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని ఉప్పేడు గ్రామస్థులకు ప్రత్యామ్నాయ నీటి వనరులు దిక్కుగా మారాయి. ఈ పల్లెలోని పలు వీధుల్లో మూడు బావులు ఉండగా, ఒక్కోదానికి 10 నుంచి 13 విద్యుత్తు మోటార్లను అమర్చి నీటి కష్టాలను తీర్చుకుంటున్నారు. 

నెల్లూరు నగరంలో ఒక చిన్న బండిపై నలుగురు, మరో చిన్న పాప వెళుతుండటం చూపరులను ఆందోళనకు గురిచేసింది. అసలే ఎండ.. ద్విచక్ర వాహనం వెనుక ఇద్దరు అమ్మాయిలు, ముందు భాగంలో మహిళ.. ఆమె వడిలో ఒక చిన్నారి నిద్రపోతూ ప్రధాన రహదారిపై వెళుతుండటాన్ని నగరవాసులు ఒకింత ఆందోళనగా గమనించారు.

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

Eenadu.net Home