చిత్రం చెప్పే విశేషాలు

(13-04-2024/1)

హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌ చౌరస్తాలో బొమ్మలు విక్రయించే ఓ చిరు వ్యాపారి ట్రాఫిక్‌ ఐలాండ్‌ పక్కనే ఇలా బొమ్మ విమానాలను వరుసగా పెట్టడంతో అటు ప్రయాణించే వారందరిని ఆకట్టుకుంటున్నాయి.

అనకాపల్లి జిల్లా మాడుగుల మోదమాంబ అమ్మవారి ఆలయ సమీపంలోని రేకుల షెడ్‌లో ప్రజలు గిరినాగును చూశారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ సిబ్బంది, స్నేక్‌ క్యాచర్‌ వెంకటేష్‌ బృందం వచ్చి 30 నిమిషాలపాటు శ్రమించి 12 అడుగుల గిరినాగును సంచిలో బంధించారు. 

 విశాఖ జిల్లా కొండకర్ల ఆవ పేరు చెబితే ప్రకృతి ప్రేమికులకు మదిని దోచే అందాలు గుర్తుకు వస్తే మాంసం ప్రియులకు మాత్రం రకరకాల చేపలు గుర్తుకొస్తాయి. ఇక్కడ లభించే కొర్రమేనుకు డిమాండ్‌ ఉంది. చూడడానికి ఆకు మాదిరిగా పల్చగా కనిపించే ఇవి నీటిలో వెండి వర్ణంలో మెరుస్తాయి.

ఈ వేసవిలో హైదరాబాద్‌ నగరంలోని చెరువులు అడుగంటుతున్నాయి. నగర శివారులోని పసుమాముల చెరువుదీ అదే దుస్థితి. ఈ చెరువులో నీరు లేక ఇక్కడికి దాహార్తి తీర్చుకునేందుకు వచ్చే మూగజీవాలు సైతం అల్లాడుతున్నాయి. సమీపంలోని వ్యవసాయ బావుల్లోనూ నీరు అడుగంటిందని రైతులు తెలిపారు.

లోక్‌సభ ఎన్నికల్లో వందశాతం పోలింగ్‌కు తమిళనాడులో పలు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. చెన్నై నీలాంగరైకు చెందిన అరవింద్‌ తరుణ్‌శ్రీ స్కూబా డైవింగ్‌ ద్వారా సుమారు 60 అడుగుల లోతులో ఆరుగురు స్కూబా డైవర్స్‌తో కలిసి ఈవీఎంలను చూపుతూ ఓటు ప్రాధాన్యతను వివరించారు. 

బషీర్‌బాగ్‌ పూల్‌బాగ్‌ బస్తీలో 12 అపార్టుమెంట్లు ఉన్నాయి. ఒక్కోదానిలో 16 కుటుంబాలుండగా, వీరందరికీ ఒకే బోరు ఉంది. ఇళ్లలో నల్లా కనెక్షన్‌ ఉన్నా ఇవ్వలేదు. తాగునీటి సమస్య తీవ్రంగా వేధిస్తోంది. ఉన్న బోరు నుంచి నాలుగు అంతస్తుల వరకు పైపులు వేసుకుంటూ నీటిని నింపుకొంటున్నారు. 

విద్యుత్‌ వాహనాల ఛార్జింగ్‌ కోసం హైదరాబాద్‌ నగరంలోని పలు ప్రాంతాల్లో తెలంగాణ స్టేట్‌ రెన్యూవబుల్‌ ఎనర్జీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(టీఎస్‌రెడ్‌కో) ఛార్జింగ్‌ స్టేషన్లు ఏర్పాటుచేసింది. టి సేవ్‌ యాప్‌లో లోపంతో పలుచోట్ల డబ్బులు కట్‌ అవుతున్నా ఛార్జింగ్‌కు వీలుపడటం లేదు.

హైదరాబాద్‌లోని లోయర్‌ ట్యాంక్‌బండ్‌పై ఉన్న రావి చెట్టు ఇది. ఫిబ్రవరిలో ఆకులన్నీ రాల్చుకుంది.. నేడు పచ్చగా ఆకట్టుకుంటోంది. 

‘మేమంతా సిద్ధం’ సభకు వచ్చిన ఓ వైకాపా నాయకుడు పెదకాకాని జాతీయరహదారి మధ్యలో కారును నిలిపి సభకు వెళ్లారు. ట్రాఫిక్‌ నిలిచిపోవడంతో పోలీసులు స్థానికుల సహాయంతో కారు ముందు చక్రానికి తాడుకట్టి లాగి పక్కన పెట్టారు.

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

Eenadu.net Home