చిత్రం చెప్పే విశేషాలు

(14-04-2024/1)

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌కు చెందిన యువ చిత్రకారుడు గుండు శివకుమార్‌ శనివారం వివిధ రూపాల్లో చిత్రాలు గీశారు. స్క్రాచింగ్‌ పద్ధతితో మర్రి, రావి ఆకులపై అంబేడ్కర్‌ చిత్రాలు గీసి నివాళులర్పించారు.

రోడ్డుపై నడవాల్సిన బస్సు లారీపై ఉంది. ఇది అసోం రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందినది. అక్కడి ట్రాన్స్‌పోర్టు శాఖ ఎలక్ట్రికల్‌ బస్సులను ప్రవేశపెట్టాలనే ఆలోచనతో వీటిని కొనుగోలు చేసింది. వీటిని లారీలపై తరలిస్తుండగా, మధ్యలో ఆదిలాబాద్‌లో ఆగి ఉన్న సమయంలో తీసిన చిత్రమిది.

కృష్ణా జిల్లా మత్స్యకారులకు అంతర్వేది సముద్ర తీరంలో 2 కచ్చిడీ చేపలు చిక్కాయి. వాటిని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అంతర్వేదిపల్లిపాలెం మినీ ఫిషింగ్‌ హార్బర్‌లో శనివారం వేలం వేయగా వ్యాపారి రూ.4 లక్షలకు కొనుగోలు చేశారు. 

గతేడాది మే నెలలోనూ నిండుకుండను తలపించిన మధ్యతరహా ప్రాజెక్టు మూసీ.. ఈ ఏడాది ఏప్రిల్‌లోనే నెర్రలుబారుతోంది. నల్గొండ జిల్లా కేతేపల్లి మండలంలో ఈ ప్రాజెక్టు కింద 33 వేల ఎకరాల ఆయకట్టు ఉండగా.. దీని పరిధిలోని కుడి, ఎడమకాల్వల కింద ఈ ఏడాది రెండు పంటలకూ నీళ్లందించారు.

ఎండలు మండిపోతున్నా చుట్టూ పచ్చదనం.. మధ్యలో జలకళ.. ఆ వెనుకే నిర్మాణ సముదాయాలతో ఈ ప్రాంతం కనువిందు చేస్తోంది కదూ. హైదరాబాద్‌లోని కిస్మత్‌పూర్‌-బుద్వేల్‌ మధ్య ఈసీ వాగు ఇలా ఆహ్లాదాన్ని పంచుతోంది. 

వేసవి ఎండలకు మనుషులతో పాటు మూగజీవాలు సైతం తల్లడిల్లుతున్నాయి. ఎండవేడి నుంచి ఉపశమనం పొందడానికి కాపలాదారులు మూసీ ప్రాజెక్ట్‌లో నీటిని జీవాలపై చల్లి, కాలువ దాటిస్తున్నారు.

విశాఖ జిల్లా గుడ్లవానిపాలెం ప్రాంత తీరంలో మత్స్యకారుల వలలో శనివారం రెండు పెద్ద ఆలివ్‌రిడ్లే తాబేళ్లు చిక్కాయి. సాగర జలాల్లో చాలా లోపల మనుగడ సాగించే ఈ జీవులు ఆహార అన్వేషణ లేదా.. గుడ్లు పెట్టేందుకు ముందుకొచ్చే క్రమంలో ఇలా వలకు చిక్కుతాయని జాలర్లు పేర్కొన్నారు.

ఆకులు రాలే కాలమిది. భగభగమండే వేసవిలో తీగదారి పూలు విరగబూసి నెలకోతీరు రంగుల్లో కన్పిస్తాయి. ఆదిలాబాద్‌ జిల్లా చెన్నూరు అటవీ ప్రాంతంలో మార్చి నుంచి మే వరకు తెలుపు రంగుతో మొదలై ఆకుపచ్చ అనంతరం పూర్తిగా పసుపు, ఎరుపు రంగులోకి మారడం దీని ప్రత్యేకత.

చిత్రం చెప్పే విశేషాలు (18-05-2024/1)

ప్రపంచాన్ని తలకిందులుగా చూద్దామా!

వినూత్నంగా చెప్పిన విశ్వక్‌సేన్‌..

Eenadu.net Home