చిత్రం చెప్పే విశేషాలు

(17-04-2024/1)

శ్రీకాకుళం జిల్లా అరసవల్లికి చెందిన సూక్ష్మ కళా చిత్రకారుడు వాడాడ రాహుల్‌ పట్నాయక్‌  పావురం ఈకపై గీసిన అయోధ్య బాలరాముని చిత్రం చూపరులను ఆకట్టుకుంది. శ్రీరామనవమి సందర్భంగా రెండు గంటల పాటు శ్రమించి బాలరాముని ప్రతిరూపాన్ని గీసినట్లు ఆయన తెలిపారు.

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం గాజులకొల్లివలస సంగమేశ్వరస్వామి కొండ వద్ద సైకత శిల్పి గేదెల హరికృష్ణ ఇసుకతో రూపొందించిన శ్రీరాముని శిల్పం చూపరులను ఆకట్టుకుంటోంది. శ్రీరామనవమి సందర్భంగా సైకత శిల్పం రూపొందించినట్లు హరికృష్ణ చెప్పారు.

కల్లు కోసం తాటి గెలల చివరన గతంలో మట్టి కుండలు (ముంతలు) కట్టేవారు. కోతులు వాటిని పగలగొడుతుండటంతో గౌడ్‌లు వాటి స్థానంలో ప్లాస్టిక్‌ సీసాలు అమర్చుతున్నారు.   హైదరాబాద్‌లోని హయత్‌నగర్‌ శివారులో కనిపించిన చిత్రమిది.

నెల్లూరు జిల్లా మనుబోలు పంచాయతీ యాచవరం గ్రామానికి చెందిన సూక్ష్మ కళాకారుడు ఆలూరు రాము ఆచారి కొయ్యతో బొటనవేలు గోటిపై ఇమిడే సూక్ష్మ శ్రీరాముని ప్రతిమను తయారుచేశారు. మంగళవారం శ్రీరాముని ప్రతిమను ప్రదర్శించడంతో పలువురు ఆయనను అభినందించారు.

శ్రీరామనవమి సందర్భంగా ఒడిశా రాష్ట్రం బ్రహ్మపురానికి చెందిన కళాకారుడు సత్యనారాయణ మహరణా కలపపై అయోధ్య రామ్‌లల్లా ఆకృతిని తీర్చిదిద్దారు. రామలల్లాతోపాటు చుట్టూ దశావతారాలు, హనుమాన్, గరుడ, స్వస్తిక్, శంఖుచక్రాలు తదితరాలు అందంగా చెక్కాడు. 

నారాయణఖేడ్‌ మండలం మనోహరాబాద్‌కు చెందిన బ్రహ్మచారి, నారాయణఖేడ్‌కు చెందిన గుండు శివకుమార్‌ రావి ఆకులపై రాములోరి చిత్రాలు మలిచి తమ భక్తిని చాటుకున్నారు. అయోధ్యలోని బాలరాముడు, పట్టాభిరామయ్య చిత్రాలను చిత్రీకరించి శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు. 

శ్రీరాముడిపై అమితమైన భక్తితో శ్రీసీతారామలక్ష్మణ హనుమంతుడి విగ్రహాలను సీసాలో ఆకర్షణీయంగా అమర్చారు.. సూర్యాపేట పట్టణంలోని సీతారాంపురం కాలనీకి చెందిన కూరెళ్లి పోతులూరాచారి అనే కార్పెంటర్‌. తన వృత్తి పని చేస్తూనే కలపతో విగ్రహాలను తయారు చేస్తుంటారు. 

డ్రైనేజీ మ్యాన్‌హోళ్లు శుభ్రం చేసేందుకు యంత్రాలు, పరికరాలు ఉన్నా.. ఓ కార్మికుడు హైదరాబాద్‌లోని ఆసిఫ్‌ నగర్‌-జిర్రా ప్రధాన రహదారిలో ఓ మ్యాన్‌హోల్‌లోకి దిగి పనులు చేస్తూ మంగళవారం ఇలా ‘న్యూస్‌టుడే’కు కనిపించాడు. 

హనుమకొండ ప్రగతినగర్‌లోని తితిదే శ్రీవేంకటేశ్వర బధిరుల పాఠశాలకు చెందిన విద్యార్థులు శ్రీరామ నవమిని పురస్కరించుకుని సీతారాముల చిత్రాలను రావి ఆకులపై చిత్రీకరించి భక్తిని చాటుకున్నారు.

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

Eenadu.net Home