చిత్రం చెప్పే విశేషాలు

(19-04-2024/1)

గరుడ ప్రసాద వితరణపై విస్తృత ప్రచారం నేపథ్యంలో హైదరాబాద్‌ శివారులోని చిలుకూరు బాలాజీ ఆలయానికి భారీగా భక్తులు పోటెత్తారు. హైదరాబాద్‌ శివారులోని చిలుకూరు బాలాజీ ఆలయం వైపు వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది.

గరుడ ప్రసాద వితరణపై విస్తృత ప్రచారం నేపథ్యంలో హైదరాబాద్‌ శివారులోని చిలుకూరు బాలాజీ ఆలయానికి భారీగా భక్తులు పోటెత్తారు. 

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల తొలి దశ పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. తొలి విడతలో భాగంగా మొత్తం 102 లోక్‌సభ స్థానాలతో పాటు అరుణాచల్‌ ప్రదేశ్‌, సిక్కింలోని శాసనసభ స్థానాల్లోనూ ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రపంచంలోనే అతిచిన్న మహిళ జ్యోతిఆమ్గే ఓటు వేసింది.

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రాజరాజేశ్వర జలాశయంలో నీటి నిల్వ తగ్గడంతో మత్స్యకారుడి వలకు గురువారం భారీ చేప చిక్కింది. బోయినపల్లి మండలం కొదురుపాక ముంపు గ్రామంలో జలాశయం నీటిలో స్థానిక మత్స్యకారుడు ర్యాకం అనిల్‌ 30 కిలోల మీనం లభించడంతో సంతోషం వ్యక్తం చేశాడు.

అమెరికాలోని లోకోమోటివ్‌ కంపెనీలో తయారైన డబ్ల్యూడీఎం2 లోకో డీజిల్‌ ఇంజిన్‌ ఇది. 1974 జులై 27న భారత్‌కు చేరుకున్న ఇది సికింద్రాబాద్‌ డివిజన్‌లో 4 దశాబ్దాలకు పైగా సేవలందించింది. బరువు 112 టన్నులు. 2016 మే 25 నుంచి దీని సేవలు నిలిపివేయగా.. కాజీపేట లోకోషెడ్‌లో పక్కన పడేశారు.

హైదరాబాద్‌ నిమ్స్‌ ఆసుపత్రికి రాష్ట్రంలోని మారుమూల గ్రామాల నుంచి సైతం రోగులు, వారి కుటుంబ సభ్యులు వస్తుంటారు. వ్యాధి పరీక్షలు, చికిత్సకు వారం పదిరోజులు సమయం పడుతుండటంతో గ్రామాలకు వెళ్లలేక ఆసుపత్రి ఆవరణలోనే కాలం గడుపుతున్నారు.

ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని పురస్కరించుకొని బన్సీలాల్‌పేటలోని మెట్లబావి వద్ద సుధారెడ్డి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. సన్మత పేరుతో నిర్వహించిన కూచిపూడి నృత్యం అలరించింది. 

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల తొలి దశ పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఓటు వేశానంటూ నటి వరలక్ష్మి శరత్‌కుమార్‌ తన తల్లిదండ్రుతో కలిసి దిగిన ఫొటోను సోషల్‌మీడియాలో పోస్టు చేశారు.

స్పెషల్‌ పాటల బాట పట్టిన తమన్నా..!

శ్రీలంక.. సిద్ధమా..!

అక్షయ్‌కుమార్‌ నాగిని డ్యాన్స్‌

Eenadu.net Home