చిత్రం చెప్పే విశేషాలు

(21-04-2024/1)

సాధారణంగా లక్ష్మణ ఫలం కిలో నుంచి రెండు కిలోల వరకు ఉంటుంది. కానీ భువనగిరి పట్టణ శివారులోని అమేయ కృషి విజ్ఞాన కేంద్రంలో లక్ష్మణ ఫలం అధిక బరువుతో కాసింది. ఈ ఫలం 15 అంగుళాల పొడవుతో 4.5 కిలోల బరువు ఉంది. 

హైదరాబాద్‌ గుడిమల్కాపూర్‌ హోల్‌సేల్‌, రిటైల్‌ మార్కెట్‌తో పాటు రైతుబజార్లలో రైతులు రెండు, మూడు రోజులుగా చింతచిగురు విక్రయిస్తున్నారు. ప్రస్తుతం గుడిమల్కాపూర్‌ రిటైల్‌ మార్కెట్‌లో కిలో రూ.500- రూ.600 పలుకుతోంది. మెహిదీపట్నం రైతుబజార్‌లో శనివారం కిలో చింత చిగురు రూ.700 పలికింది. 

వరంగల్‌ జిల్లాలోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌ ఇది. ఇక్కడ మిర్చి కొనుగోళ్లు జరిగినప్పుడు బస్తాల నుంచి మిర్చి, గింజలు అక్కడక్కడ పడిపోతుంటాయి. శనివారం కురిసిన వర్షానికి అవి తడిసి ముద్దవడంతో మార్కెట్‌ పరిసరాలు ఇలా ఎరుపెక్కాయి.

మాదాపూర్‌లోని చిత్రమయి స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో రంగురంగుల చిత్రాలు, శిల్పాలు కొలువుదీరాయి. దేశంలోని వివిధ నగరాలకు చెందిన 41 మంది దివ్యాంగులు మలిచిన అందమైన చిత్రాలను ఈ ఆర్ట్‌ గ్యాలరీలో ప్రదర్శనకు ఉంచారు. ఈ చిత్రాలు చూపరులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

ఆదిలాబాద్‌ రిమ్స్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి ఐసీయూ విభాగంలో సుమారు నెల రోజులుగా ఏసీలు పనిచేయడం లేదు. ఆసుపత్రి యాజమాన్యం 10 చిన్న టేబుల్‌ ఫ్యాన్లు అక్కడక్కడ ఏర్పాటు చేసింది. ఆ గాలి చాలక ఉక్కపోతతో కొందరు రోగులు సొంత డబ్బులతో ఫ్యాన్లు కొనుక్కొని తెచ్చుకుంటున్నారు.

భారత నౌకాదళం ఆధ్వర్యంలో తూర్పు కోస్తా తీరంలో ‘ఎక్స్‌పీఓఎల్‌ (పూర్విలెహర్‌)- 2024’ విన్యాసాలు నిర్వహించినట్టు నేవీ వర్గాలు తెలిపాయి. ఈ విన్యాసాల్లో పాల్గొన్న యుద్ధనౌకలు, ఎయిర్‌క్రాఫ్ట్‌లు, ప్రత్యేక దళాలు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాయి.

పార్లమెంటు ఎన్నికల్లో పోలింగ్‌ శాతాన్ని పెంచేందుకు జీహెచ్‌ఎంసీ కమిషనర్, హైదరాబాద్‌ జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్‌రాస్‌ చేపట్టిన అవగాహన కార్యక్రమాలు పౌరులను ఆకట్టుకుంటున్నాయి.

ప్రైవేటు వాహనాల చోదకులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. కనీస జాగ్రత్తలు పాటించకుండా ప్రమాదాలకు కారణమవుతున్నారు. వరంగల్‌ జిల్లా ఫోర్ట్‌రోడ్‌లోని ఓ పాఠశాల విద్యార్థులు ఇలా ఆటో వెనుక భాగంలో నిల్చొని.. వెళ్తుండగా ‘న్యూస్‌టుడే’ క్లిక్‌మనిపించింది.

 గత నాలుగు రోజల నుంచి ఉష్ణొగ్రత 40 డిగ్రీలు దాటుతోంది. ఎన్నడూ చూడని విధంగా సూర్యుడి ప్రతాపం ఉండటంతో ఉదయం 11 గంటలకే పట్టణ వీధులన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. అయితే ఉదయం మంచు కురుస్తుండటం.. చిత్తూరు పట్టణవాసులను ఆశ్చర్యపరుస్తోంది.

ఉర్ఫీ.. డ్రెస్‌ అదుర్స్‌

థ్రిల్లింగ్‌ విక్టరీ.. మైదానంలో హైదరాబాద్‌ సందడి

చిత్రం చెప్పే విశేషాలు (03-05-2024/1)

Eenadu.net Home