చిత్రం చెప్పే విశేషాలు..

(21-04-2024/2)

తెదేపా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు చేతుల మీదుగా మంగళగిరి తెదేపా అభ్యర్థిగా నారా లోకేశ్‌ బీఫామ్ అందుకున్నారు.

గుంటూరు జిల్లా మంగళగిరి మండలం బేతపూడిలో నారా బ్రాహ్మణి పర్యటించారు. ఈ సందర్భంగా మల్లెపూలు కోసే కూలీలతో మాట్లాడారు.

మాదాపూర్‌లోని చిత్రమయి స్టేట్‌ ఆర్ట్‌ గ్యాలరీలో వివిధ నగరాలకు చెందిన 41 మంది దివ్యాంగులు వేసిన చిత్రాలను ప్రదర్శించారు. ఇవి చూపరులను ఆకట్టుకుంటున్నాయి.

ముంబయిలో పేరుగాంచిన సరోజ్ ఫ్యాబ్రిక్స్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. బంజారాహిల్స్‌లో ఏర్పాటు చేసిన ఈ స్టోర్‌ను శనివారం సినీనటి సోనియా సింగ్‌ ప్రారంభించారు.

కాంగ్రెస్ పార్టీ న్యాయ యాత్ర పర్యటనలో భాగంగా పీసీసీ అధ్యక్షురాలు షర్మిల కర్నూలులో పర్యటించారు. ఈ సందర్భంగా అధికార పార్టీపై మండిపడ్డారు.

హీరో కార్తికేయ, ఐశ్వర్య మేనన్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘భజే వాయు వేగం’. ఈ సినిమా టీజర్‌ని సినీ నటుడు చిరంజీవి ‘విశ్వంభర’ సెట్‌లో విడుదల చేశారు.

స్విట్జర్లాండ్‌లోని అరోల్లా, వెర్బియర్‌ల మధ్య స్విస్ ఆల్ప్స్‌లో 24వ గ్లేసియర్ పెట్రోల్ రేసులు జరుగుతున్నాయి. పోటీదారులు ఇలా పర్వతాలను అధిరోహిస్తున్నారు.

ఐపీఎల్‌ 2024లో భాగంగా కోల్‌కతాతో పోరులో బెంగళూరు టాస్‌ నెగ్గి బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌కు వేదిక ఈడెన్‌ గార్డెన్స్‌. వరుసగా ఓటములు చవిచూసిన బెంగళూరు ప్లేఆఫ్స్‌కు చేరుకోవాలంటే ప్రతి మ్యాచూ కీలకమే.

కేన్స్‌లో అవ్‌నీత్‌ కౌర్‌ హొయలు!

కేరళ కుట్టిగా మారినహరియాణా భామ

చిత్రం చెప్పే విశేషాలు(24-05-2024/1)

Eenadu.net Home