చిత్రం చెప్పే విశేషాలు

(22-04-2024/1)

పిల్లలకు వేసవి సెలవులు మొదలవడం, సాయంత్రం వాతావరణం చల్లగా మారడంతో ట్యాంక్‌బండ్‌పై సందర్శకులు, వాహనాల తాకిడి పెరిగింది. ఈ క్రమంలో ఆదివారం రాత్రి ట్రాఫిక్‌ స్తంభించడంతో గంటలపాటు వాహనదారులు అవస్థపడ్డారు. కొందరు వాహనచోదకులు వెనక్కి వెళ్లేందుకు ప్రయత్నించారు.

భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. దీంతో అత్యవసరాల కోసం బయటకు వెళ్లాలంటే ఎండ పడకుండా చున్నీలు, స్కార్ఫ్‌లు, కర్చీఫ్‌లతో తల, ముఖం, చేతులపై కప్పుకోవడంతోపాటు గొడుగులేసుకుని బయల్దేరుతున్నారు. వ్యాపారాలు చేసుకునే వాళ్లకు ఫ్యాను, కూలర్లు ఉండాల్సిందే.

సాధారణంగా ఓ చెట్టుకు ఒకటి లేదా రెండు వరకు తేనె తుట్టెలను గమనిస్తుంటాం. మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలోని ఓ చెట్టుకు ఏకంగా పద్నాలుగు తేనెతుట్టెలుండటం ఆసక్తి రేకిత్తిస్తోంది. ఒకే చెట్టుకు పెద్ద సంఖ్యలో తేనె తుట్టెలుండగా స్థానికులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. 

మన వద్ద వివాహాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ప్రత్యేకంగా అలంకరించిన రథాలను లాగేందుకు గుర్రాలను వినియోగిస్తున్నారు. గుర్రానికి శ్రమ లేకుండా ఇలా ట్రాలీ ఆటో ఎక్కించి, వెనక రథాన్ని కట్టి తీసుకువెళ్తున్నారు. ట్యాంక్‌ బండ వద్ద ఆదివారం కనిపించిన చిత్రం ఇది. 

ఆదిలాబాద్‌ జిల్లా బజార్‌హత్నూర్‌ మండలం డేడ్రా గ్రామంలో విద్యుత్తు తీగలు ప్రమాదకరంగా మారాయి. గ్రామంలోని ఓ ఇంటి వద్ద పెళ్లి వేడుక ఉండటంతో వదులుగా ఉన్న విద్యుత్తు తీగలతో ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని గ్రహించి ఇలా కర్రలు ఏర్పాటు చేసుకున్నారు.

మెదక్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గా మాత ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఆదివారం వారాంతపు సెలవు రోజు కావడంతో ఉమ్మడి జిల్లా వాసులతో పాటు పరిసర జిల్లాలైన కరీంనగర్, నిజామాబాద్, జంటనగరాలు, పొరుగు రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చారు.

బండరాళ్లు కదా అని వాటిని అలాగే వదిలి వేయలేదు. వాటిపై వన్యప్రాణుల బొమ్మలు వేయడంతో పాటు.. చుట్టూ పచ్చటి మొక్కలు పెంచుతుండటం ఆకట్టుకుంటోంది. మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని నెక్నాంపూర్‌ చెరువు కూడలి వద్ద కనిపించిన దృశ్యం.

ఈనెల 23న హనుమాన్‌ జయంతి సందర్భంగా విద్యుత్తు దీపాల ధగధగల మధ్య మెరుస్తున్న సికింద్రాబాద్‌ సిఖ్‌ విలేజ్‌ రహదారులు.

రద్దీగా బంజారాహిల్స్‌ రోడ్డు నంబరు 2లో ఓ చిరువ్యాపారి ఇలా చరవాణి చూస్తూ ప్రయాణిస్తున్నాడు. ముందు వెళ్తున్న వాహనం బ్రేక్‌ వేసినా.. ఈయన వాహనం పట్టు తప్పినా మూల్యం చెల్లించుకోక తప్పదు.

ఉర్ఫీ.. డ్రెస్‌ అదుర్స్‌

థ్రిల్లింగ్‌ విక్టరీ.. మైదానంలో హైదరాబాద్‌ సందడి

చిత్రం చెప్పే విశేషాలు (03-05-2024/1)

Eenadu.net Home