చిత్రం చెప్పేవిశేషాలు (22-04-2024)

తెదేపా అధినేత చంద్రబాబు దంపతులు 

శ్రీశైలం మల్లన్న స్వామిని దర్శించుకున్నారు. స్వామివారికి రుధ్రాభిషేకం చేశారు.

సివిల్స్-2023లో ఆల్ ఇండియా 196వ ర్యాంకు సాధించిన అక్షయ్ దీపక్‌ను సీఎం రేవంత్‌ రెడ్డి అభినందించారు. ఈ సందర్భంగా సీఎం క్యాంపు కార్యాలయంలో శాలువా కప్పి సన్మానించారు.

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఉండి తెదేపా అభ్యర్థిగా కనుమూరు రఘురామకృష్ణ రాజు నామినేషన్‌ దాఖలు చేశారు.

కాజల్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న సత్యభామ చిత్రం మే 17న విడుదల చేస్తున్నట్లు తాగాజా చిత్ర బృందం తెలిపింది.

మసూద ఫేమ్‌ తిరువీర్‌ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. కల్పనా రావు అనే యువతిని ఆయన వివాహం చేసుకున్నారు. 

తిరుమలలో శ్రీవారి స్వర్ణరథోత్సవం వైభవంగా సాగింది. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి తిరుమాడ వీధుల్లో ఊరేగి భక్తులకు అభయ ప్రదానం చేశారు.

కొండగట్టులో హనుమాన్‌ చిన్న జయంతి ఉత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి. భక్తులు, దీక్షాపరులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.

బంజారాహిల్స్‌లో ‘హైసెన్స్‌ హెచ్‌వాక్‌’ సెంటర్‌ను ప్రారంభించారు. నటి స్రవంతి చొక్కారపు, మోడల్స్‌, నిర్వాహకులు ఫొటోలకు పోజులిచ్చి సందడి చేశారు.

కేన్స్‌లో అవ్‌నీత్‌ కౌర్‌ హొయలు!

కేరళ కుట్టిగా మారినహరియాణా భామ

చిత్రం చెప్పే విశేషాలు(24-05-2024/1)

Eenadu.net Home