చిత్రం చెప్పే విశేషాలు (23-04-2024/1)

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కాసేపట్లో నామినేషన్‌ దాఖలు చేశారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలు, నేతలు భారీ ర్యాలీ చేపట్టారు.

దేశంలోని పలు రంగాలకు చెందిన ప్రముఖులకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ‘పద్మ’ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈ అవార్డులను అందజేశారు.

హనుమాన్‌ జయంతి వేడుకలు వివిధ ప్రాంతాల్లో ఘనంగా నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు.

హనుమాన్‌ జన్మోత్సవం సందర్భంగా దర్శకుడు ప్రశాంత్‌ వర్మ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. ‘జై హనుమాన్‌’ మూవీని ఐమ్యాక్స్‌ 3డీ ఫార్మాట్‌లో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

తిరుమల శ్రీ‌వారి ఆల‌యంలోని వసంతోత్సవ మండపంలో గత మూడు రోజులపాటు అంగరంగ వైభవంగా జ‌రిగిన‌ సాలకట్ల వసంతోత్సవాలు మంగళవారం కన్నులపండుగగా ముగిశాయి.

బంజారాహిల్స్‌లో సూత్ర ఎగ్జిబిషన్ ప్రారంభించారు. రెండు రోజుల పాటు ఎగ్జిబిషన్‌ జరగనుంది. సినీ నటి రతికా, మోడల్స్‌, ఫ్యాషన్ ప్రియులు హాజరై నూతన ఆభరణాలతో ఫొటోలకు పోజులిచ్చి సందడి చేశారు.

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ అలంపూర్ జోగులాంబ దేవి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

వేసవి సెలవులు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థులు ఇళ్లకు వెళ్లేందుకు ప్రయాణమవుతున్నారు. 

ఉర్ఫీ.. డ్రెస్‌ అదుర్స్‌

థ్రిల్లింగ్‌ విక్టరీ.. మైదానంలో హైదరాబాద్‌ సందడి

చిత్రం చెప్పే విశేషాలు (03-05-2024/1)

Eenadu.net Home