చిత్రం చెప్పే విశేషాలు

(24-04-2024/1)

రామలక్ష్మణ జానకీ.. జై బోలో హనుమాన్‌కీ నినాదాలు.. డప్పు చప్పుళ్లు, డీజే మోతలు.. యువత కేరింతల మధ్య వీర హనుమాన్‌ విజయయాత్ర ఘనంగా జరిగింది. హనుమాన్‌ జయంతిని పురస్కరించుకుని గౌలిగూడలోని రామమందిరం నుంచి శోభాయాత్ర సికింద్రాబాద్‌ తాడ్‌బంద్‌ హనుమాన్‌ మందిరం వరకు సాగింది. 

సొనాల నుంచి టివిటి మీదుగా ఆదిలాబాద్ జిల్లా బోథ్‌కు వెళ్లే దారిలో పచ్చని జొన్న పంటలో ఓ మామిడి చెట్టు మోడువారి చూపరులను ఆకట్టుకుంటోంది. మోడు వారిన చెట్టు చుట్టూ జొన్న పంట ఉండటంతో ఆకుపచ్చని పొలాల మధ్యన ఎండిన చెట్టు అటు వైపుగా వెళ్లే ప్రయాణికులను ఆకట్టుకుంటోంది.

ములుగు జిల్లా వెంకటాపురం మండలం మల్లాపురం మార్గంలోని రైతు మునయ్య ఎనిమిదెకరాల్లో విత్తనోత్పత్తి సాగు చేపట్టాడు. చేను సమీపంలోని రాఘవమ్మకుంట ఎండిపోవడంతో నీటిఎద్దడి ఏర్పడింది. దీంతో క్షేత్రాన్ని ఇలా పశువులకు మేతగా వదిలేశారు.

కరీంనగర్‌ జిల్లా ఇల్లందకుంట శ్రీసీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి వారిని సూర్యరథంపై ఊరేగించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.

భానుడు భగభగ మండుతున్నాడు. ఎండల నుంచి తప్పించుకునేందుకు వీధి వ్యాపారులు రకరకాల ఉపాయాలను అనుసరిస్తున్నారు. నల్గొండలోని దేవరకొండ రోడ్డులో ఓ వ్యక్తి తోపుడు బండిపై దుప్పటి పేర్చుకుని వ్యాపారం సాగిస్తుండగా ’న్యూస్‌టుడే’ క్లిక్‌ మనిపించింది.

కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామంలోని పేదలకు 2008లో అప్పటి ప్రభుత్వం పేదలకు నివాస స్థలాల పట్టాలు పంపిణీ చేసింది. ఇటీవల 180 మంది లబ్ధిదారుల్లో 55 మంది ఇలా రేకులతో నివాస గృహాలు ఏర్పాటు చేసుకోగా.. మిగతా వారు గుడిసెలు వేసుకున్నారు.

మట్టికుండతో చల్లని గాలి కూడా వస్తుంది. కుండలో నీరుపోసి.. దానిపై తక్కువ విద్యుత్తుతో నడిచే ఫ్యాన్‌ను అమర్చి ఈ ఎయిర్‌కూలర్‌ను తయారు చేశారు హైదరాబాద్‌లోని తాళ్లగడ్డకు చెందిన కుమ్మరి ప్రభాకర్‌. గది ఉష్ణోగ్రతను 7 డిగ్రీలకుపైగా తగ్గిస్తుందని చెబుతున్నాడు.

రమేశ్, మహమూద్‌.. ఒకరు ప్రమాదంలో చేయి కోల్పోయారు.. మరొకరికి అనారోగ్యంతో కాళ్లు చచ్చుపడిపోయాయి. ఇద్దరు హైదరాబాద్‌ పాత బస్తీకి చెందిన వారే. నిరు పేదలు కావడంతో  కుటుంబాలకు భారమయ్యారు. చాదర్‌ఘాట్‌ కూడలిలో ఇలా బిక్షాటన చేస్తూ కనిపించారు.

కనులవిందుగా పచ్చదనం పరుచుకున్నట్టుగా కనిపిస్తోంది కదూ. వాస్తవమేమిటంటే.. ఏళ్లుగా హుసేన్‌ సాగర్‌లో కలుషిత నీరు, పరిశ్రమల వ్యర్థ జలాలు కలుస్తూనే ఉన్నాయి. ఎండలకు నీరు ఇలా పచ్చగా మారి తీవ్ర దుర్గంధం వ్యాపిస్తోంది.

చీరకు మించిందేమీ లేదు..!

బాస్‌ లేడీ.. శ్రీలీల

చిత్రం చెప్పే విశేషాలు(04-05-2024/1)

Eenadu.net Home