చిత్రం చెప్పే విశేషాలు

(27-04-2024/1)

మే 13న సార్వత్రిక ఎన్నికల్లో అర్హులందరూ తమ ఓటు హక్కు వినియోగించుకునేలా జిల్లా యంత్రాంగం విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టింది. ఇందులో భాగంగా ఒంగోలు నగరంలోని ఆర్డీవో కార్యాలయ ప్రాంగణంలో తీర్చిదిద్దిన సైకత శిల్పం అందరినీ ఆకట్టుకుంటోంది.

అధికార యంత్రాంగం ఆదిలాబాద్‌ జిల్లాలో పోలింగ్‌ శాతం పెంచేలా ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటు వేసేలా చైతన్య పరుస్తూ ఆదిలాబాద్‌ పట్టణం ఎన్టీఆర్‌ చౌక్‌లో అందరికి కనిపించేలా భారీ కటౌట్‌ను ఏర్పాటు చేశారు.

ఈవీఎంలో ఓటు ఎలా వేయాలో ప్రజలకు అవగాహన కల్పించడానికి విజయవాడలోని ప్రధాన కూడళ్లలో ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో బ్యాలట్‌ యూనిట్‌ బెలూన్లు ఏర్పాటు చేశారు. ప్లాస్టిక్‌ బెలూన్లలో గాలి నింపి వివిధ ప్రాంతాల్లో నిలబెట్టారు. వాటిలో నుంచి గాలిపోయి ఇలా కింద పడిపోయాయి.

నల్గొండ జిల్లా మునుగోడు తహసీల్దారు కార్యాలయంలో పచ్చదనం పెంపొందించేందుకు పలు రకాల మొక్కలను నాటి వాటిని సంరక్షిస్తున్నారు. చుట్టూ పచ్చని చెట్లు ఉన్నా.. కార్యాలయం ఎదురుగా ఉన్న బాదం చెట్టు ఎండిపోయి కనిపిస్తోంది. దీనికి నీరందించి రక్షించాలని స్థానికులు కోరుతున్నారు. 

ఇది షీ టీమ్స్‌ విభాగం సంచార వాహనం. పోకిరీల ఆగడాలు, వాటిని ఎదుర్కొనే విధానంపై యువతులకు సందేశాత్మక చిత్రాల ద్వారా అవగాహన కల్పిస్తారు. హైదరాబాద్‌లోని నెక్లెస్‌ రోడ్డులో అంబేడ్కర్‌ విగ్రహం వద్ద కనిపించింది.

పోలింగ్‌ శాతాన్ని పెంచడానికి ఎన్నికల విభాగం, బల్దియా అన్ని చర్యలు తీసుకుంటోంది. ఓటర్లలో అవగాహన కల్పించడానికి ఉన్న అవకాశాలన్నింటినీ వినియోగించుకుంటోంది. ఇందులో భాగంగా ఖైరతాబాద్‌ చౌరస్తాలో పోలింగ్‌ తేదీని సూచిస్తూ.. మీ ఓటు.. మీ బలం అంటూ నినాదాలతో భారీ బెలూన్‌ ఎగరేసింది.

మాడు పగిలిపోయేలా ఉన్న భానుడి ప్రతాపంతో జనం విలవిల్లాడుతున్నారు. కొందరు యువకులు ఎండను లెక్క చేయకుండా ఓపెన్‌ ఆటోలో ఇలా ప్రమాదభరితంగా ప్రయాణిస్తూ ట్యాంక్‌బండ్‌ సికింద్రాబాద్‌ రోడ్డులో కనిపించారిలా..

అడవిలో నివసించే గిరిజనుల వివాహాలకు ఒక ప్రత్యేకత ఉంటుంది. ఈ సమయంలో లందా అనే పానియం తప్పనిసరిగా ఉండాల్సిందే. ఇది మత్తుగా ఉంటుంది. రెండు, మూడు క్వింటాళ్ల బియ్యాన్ని పిండిగా చేసి కుండల్లో నీటితో కలిపి భూమిలో పాతిపెడతారు. పెండ్లి రోజున దీనిని బయటకు తీసి అందరికీ అందిస్తారు.

చిత్రం చెప్పేవిశేషాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు

Eenadu.net Home