చిత్రం చెప్పే విశేషాలు

(28-04-2024/1)

విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించడంతో మైదానాలు సందడిగా మారుతున్నాయి. క్రీడా శిబిరాలు నిర్వహిస్తుండటంతో చిన్నారులు శిక్షణకు హాజరవుతున్నారు. హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌ స్టేడియంలో పిల్లలు ఇలా సాధన చేస్తూ కనిపించారు. 

మండుతున్న ఎండలకు హైదరాబాద్‌లోని హైటెక్‌ సిటీ రైల్వే స్టేషన్‌కు ఆనుకుని ఉన్న ముల్లకత్వ చెరువులో నీరింకి కొంతభాగం బీడుగా మారింది.  రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని   చెరువులో పూడికతీత పనులు మొదలుపెట్టారు. పనులు జోరుగా సాగుతున్నాయి.

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఏసీసీ సిమెంట్ కర్మాగారం ఇటీవల మూతపడింది. కార్మికులంతా ఇళ్లు ఖాళీ చేసి వివిధ ప్రాంతాలకు వెళ్లడంతో ఈ క్వార్టర్లను కూల్చివేస్తున్నారు. ఓ ఇంటిని ఆనుకుని ఊడలు, వేర్లతో సహా పెరిగిన మర్రిచెట్టొకటి గోడలను తొలగించిన అనంతరం ఇలా నిలబడినట్లు కనిపిస్తోంది

పాకాల సరస్సుకు గోదావరి జలాల రాకతో ప్రస్తుతం నీటిమట్టం 17.9 అడుగులకు చేరింది. వరంగల్‌ జిల్లా ఖానాపురం శివారులో పాకాలవాగుపై నిర్మించిన చెక్‌డ్యాంలోకి నీరు పుష్కలంగా చేరడంతో మత్తడి పోస్తోంది. మండుతున్న ఎండల్లోనూ చెక్‌డ్యాం నీటితో కళకళలాడుతోంది.

మాచర్ల పట్టణంలోని 30, 31 వార్డులకు నీటి సరఫరా చేసే బోరు మోటారు స్విచ్‌బోర్డు మరమ్మతులకు గురైంది. ఐదు రోజులైనా బాగు చేయకపోవడంతో ఆయా వార్డుల ప్రజలకు నీటి కష్టాలు తీవ్రమయ్యాయి. రోజుకు ఒకటి, రెండు ట్యాంకర్లను పంపి అధికారులు మమ అనిపిస్తున్నారు

గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో తూకాలు వేసిన ధాన్యం బస్తాలు ట్రాక్టర్లలో కేటాయింపు చేసిన మిల్లులకు తరలి వస్తున్నాయి. కరీంనగర్‌ జిల్లా శంకరపట్నం మండలం మొలంగూర్‌ గ్రామ శివారు ఓ మిల్లు వద్ద ఇలా బారులుదీరి కనిపించాయి.  

తీవ్రమైన ఎండల నేపథ్యంలో హంపీ పర్యటనకు వచ్చే పర్యాటకులు.. ఆ చుట్టుపక్కల తుంగభద్ర ఆధారిత నీటి కొలనులలో ఈతకొట్టి సేదదీరుతున్నారు.

జాస్పర్‌ ఫొటోను సోషల్‌ సైన్సెస్‌ ప్రిన్సిపల్, ప్రొఫెసర్‌ అర్జున్‌రావుకు గురుదక్షిణగా ఇచ్చారు. ఓయూ 107వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా జాస్పర్‌ ఫొటోను పెద్దగా మార్పించి ప్రదర్శనలో ఉంచారు. వర్షిత్‌ రెడ్డి కష్టాన్ని, కృషిని ఆచార్యులు అభినందించారు.

చిత్రం చెప్పేవిశేషాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు

Eenadu.net Home