చిత్రం చెప్పే విశేషాలు

(29-04-2024/1)

కరీంనగర్‌ జిల్లా వీర్నపల్లి మండల కేంద్రానికి చెందిన సంటి జ్యోతి, స్టాండ్లిన్‌ దంపతుల ఇంటి పెరటిలో మే పుష్పం ముందుగానే వికసించింది. ఆకర్షణీయంగా ఉన్న ఈ పువ్వుతో పలువురు స్థానికులు స్వీయచిత్రాలు తీసుకుంటున్నారు.

హైదరాబాద్‌లోని మాదాపూర్‌ శిల్పారామంలో అంతర్జాతీయ నృత్యోత్సవాన్ని పురస్కరించుకుని ప్రదర్శించిన కూచిపూడి నృత్యం నయనానందకరంగా సాగింది. అభినయావని నృత్యానికేతన్‌ నాట్య గురువు చావళి బాల త్రిపుర సుందరి శిష్య బృందం చేసిన నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది.

సిద్దిపేట పట్టణంలోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ క్రికెట్‌ స్టేడియంలో నిర్వహిస్తున్న వేసవి క్రికెట్‌ శిక్షణ శిబిరంలో యువత ఉత్సాహంగా పాల్గొంటున్నారు. రోజూ 200 మంది శిబిరానికి వచ్చి శిక్షణ పొందుతున్నారు. 

గాజాలోని ఖాన్‌యూనిన్‌లో తాత్కాలిక శిబిరంలో ఏర్పాటు చేసిన ఓ పాఠశాలలో పాలస్తీనా చిన్నారులు చదువుకుంటున్న దృశ్యం.

శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలంలోని ఉప్పరపేట గ్రామస్థులంతా ఊరి చెరువులో చేపలకు ఎగబడ్డారు. చిన్నా, పెద్ద తేడా లేకుండా ఉత్సాహంగా చేపలు పట్టుకున్నారు. గ్రామస్థులంతా చేపలు పట్టుకుంటూ సందడి చేశారు.

హైదరాబాద్‌ గచ్చిబౌలి డివిజన్‌లోని గోపనపల్లితండా వద్ద ఒకవైపు తెల్లాపూర్‌ నుంచి, మరోవైపు నల్లగండ్ల నుంచి నానక్‌రాంగూడ మీదుగా బాహ్యవలయ రహదారిని కలిపేలా నిర్మించిన వంతెన పనులు పూర్తయ్యాయి. త్వరలోనే ఇది అందుబాటులోకి రానుంది. దీంతో రద్దీ లేకుండా వాహనదారులు రయ్‌రయ్‌మంటూ దూసుకెళ్లొచ్చు.

హైదరాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న భారాస ఎంపీ అభ్యర్థి గడ్డం శ్రీనివాస్‌యాదవ్‌ తనదైన శైలి ప్రచారంతో ఆకట్టుకుంటున్నారు. జాంబాగ్‌ డివిజన్‌లో సాగించిన ప్రచారంలో ఇస్త్రీ చేసి అలరించారు.

ఎన్నికల సమయం సమీపిస్తుండటంతో పాటు ఈసారి పోలింగ్‌ శాతం పెంచడానికి ముందుగానే ఓటరు చీటీల పంపిణీని యంత్రాంగం ప్రారంభించింది. బీఎల్వోలు ఇంటింటికీ వెళ్లి వాటిని అందిస్తూ తప్పకుండా ఓటేయాలని చెబుతున్నారు. 

చిత్రం చెప్పేవిశేషాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు

Eenadu.net Home