చిత్రం చెప్పే విశేషాలు

(01-05-2024/1)

కార్మిక దినోత్సవం మే డే సంద్భంగా నక్కపల్లి మండలం చినదొడ్డిగల్లుకు చెందిన సూక్ష్మ కళాకారుడు, కార్పెంటర్‌ దార్ల రవి మే డే పేరుతో పాటు, చిహ్నాన్ని చెక్కపై మలిచాడు. దీనికి సుమారు మూడు గంటల సమయం పట్టినట్లు రవి తెలిపాడు.

కూకట్‌పల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన చెన్నై షాపింగ్ మాల్‌లో యాంకర్ సుమ సందడి చేశారు. బంగారు నగలతో ఫొటోలకు ఫోజులు ఇచ్చారు.

ఏడాదిలో మే నెలలో మాత్రమే వికసిస్తుంది మే పుష్పం. జిల్లా కేంద్రంలోని కైలాస్ నగర్ కాలనీలో నివసిస్తున్న ఉల్లాస్ ఇంట్లో బుధవారం మే పుష్పం వికసించింది. కాలనీవాసులు, ప్రజలు వాటిని చూసేందుకు ఆసక్తిగా తిలకించారు.

తొలిసారి ఓటు హక్కు పొందిన వారిని పోలింగ్‌ బూత్‌కు వచ్చేలా ప్రోత్సహించడానికి అస్సాంలోని కామరూప్‌ జిల్లా ఎన్నికల అధికారి కీర్తి జల్లి వినూత్న ఆలోచన చేశారు. రెండో సారి ఓటు వేయబోతున్నవారు కొత్త ఓటర్లను ప్రోత్సహించేలా ‘బడ్డీ ఓటర్‌’ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు.

భోగాపురం మండలం మెట్టసబ్బన్నపేట నుంచి నందిగాం గ్రామానికి వెళ్లే ఈ ఉప్పుగెడ్డ వంతెన అయిదేళ్ల కిందట కొట్టుకుపోయింది. వర్షాకాలంలో దీనిపై నుంచి వరదనీరు పారడంతో రాకపోకలు నిలిచిపోతున్నాయి.

 ఓటు ప్రాధాన్యతను తెలియజేస్తూ తిరువూరు ఆర్డీవో కార్యాలయం ఆవరణలో మంగళవారం అంగన్‌వాడీ, వెలుగు ఉద్యోగులు అక్షరరూపంలో కూర్చుని సందేశమిచ్చారు. ‘ఓటు మన హక్కు, ఓటు వేద్దాం మే 13న’ అన్న ఆకృతిలో ఆకట్టుకున్నారు.

ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ఉపశమనం పొందేందుకు తమిళనాడులోని మెరీనా సముద్రతీరంలో నగర వాసులు స్నానం చేస్తూ సేదదీరారు. 

ఓటర్ల చైతన్య కార్యక్రమాల నిర్వహణలో బెళగావి అధికారులు కొత్త పుంతలు తొక్కుతున్నారు. మొన్నటికి మొన్న నగర తాటాకంలో పడవల్లో ఊరేగుతూ ప్రచారం చేయగా.. ఏకంగా ఆకాశంలోకి భారీ బెలూన్లు వదలి.. ఓటు ఘనతను ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు.

చిత్రం చెప్పే విశేషాలు (18-05-2024/1)

ప్రపంచాన్ని తలకిందులుగా చూద్దామా!

వినూత్నంగా చెప్పిన విశ్వక్‌సేన్‌..

Eenadu.net Home