చిత్రం చెప్పే విశేషాలు

(03-05-2024/1)

ఈ చిన్న పక్షి హైదరాబాద్‌లోని కాప్రా చెరువు వద్ద కనిపించింది. ‘‘ఇది ‘లిటిల్‌ రింగ్డ్‌ ప్లవర్‌’జాతికి చెందిన పక్షి. ఈ పక్షుల శరీర పైభాగం, రెక్కలు బూడిద-గోధుమ రంగులో ఉంటాయి. కింది భాగం తెల్లగా ఉంటుంది. ఆడపక్షి, మగపక్షి ఒకసారి జతకడితే.. జీవితకాలమంతా కలిసే ఉంటాయి.

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లకు అవగాహన కలిగించేలా బల్దియా నడుం బిగించింది. పోలింగ్‌ తేదీ, ఇతర వివరాలతో భారీ హీలియం బెలూన్‌ను హైదరాబాద్‌లోని సచివాలయంలో ఏర్పాటు చేసింది

హైదరాబాద్‌లోని హైటెక్‌సిటీ కూడలి వద్ద రూ.లక్షలు వెచ్చించి ఏర్పాటు చేసిన డిజిటల్‌ వాయిస్‌ డిస్‌ప్లే బోర్డు ఇది. నిర్వహణ లేక నిరుపయోగంగా పడి ఉంది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఓటరు చైతన్యంపై ప్రచారం కోసం వీటిని వినియోగించుకోవచ్చని పలువురు సూచిస్తున్నారు. 

రోజురోజుకూ ఎండల తీవ్రత పెరుగుతోంది. వడగాల్పులు, ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రత్యామ్నాయంగా ప్రయాణ సమయంలో అనేక మంది జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చల్లని కళ్లద్దాలు, మాస్కులు, టోపీలు, బ్యాటరీ ఫ్యాన్లు వినియోగిస్తున్నారు. 

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అందరూ ఓటు హక్కు వినియోగించుకునేలా జిల్లా యంత్రాంగం కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా సంగారెడ్డి కలెక్టరేట్‌ వద్ద ఏర్పాటుచేసిన ఈవీఎం నమూనా ఆకట్టుకుంటోంది. ఓటేయడానికి సంగారెడ్డి జిల్లా సిద్ధంగా ఉంది అని దీనిపై రాసి ఉంచారు.

తమిళనాడు రాష్ట్రంలోని కోవై సమీప తిమ్మపాళ్యానికి చెందిన కిట్టాన్‌ అనే వ్యక్తి మేకల ఫాం నిర్వహిస్తున్నాడు. సాధారణంగా మేకలు రెండు లేదా 3 పిల్లల్ని ఈనుతాయి. ఇతని ఫాంలోని ఓ మేక ఏకంగా 7 పిల్లల్ని ఈనడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. 

కవ్వాల్‌ పెద్దపులుల సంరక్షణ కేంద్రం పరిధిలో పెద్దపులి, ఇతర జంతువులు స్వేచ్ఛగా సంచరించేందుకు వీలుగా అటవీ ప్రాంతాన్ని వదిలి మైదాన ప్రాంతానికి రావాలని అటవీశాఖ పిలుపునిచ్చింది. ఈ మేరకు నిర్మల్‌ జిల్లా కడెం మండలం మైసంపేట, రాంపూర్‌ గ్రామాలు అడవిని వీడాయి. 

తమిళనాడు రాష్ట్రం వేలూర్‌ జిల్లాలోని గుడియాత్తం, వానియంబాడి, ఆంబూర్‌ తదితర ప్రాంతాల్లో వడగండ్ల వర్షం కురిసింది.  

ఎండలు మండుతున్నాయి. ఇంట్లో ఉన్నా వేడి సెగలను తట్టుకోలేని పరిస్థితి. ఈ వేడి నుంచి ఉపశమనం పొందేందుకని ప్రజలు ఏసీలు, కూలర్లు కొంటున్నారు. హైదరాబాద్‌లోని చందానగర్‌ వద్ద ఇద్దరు యువకులు కూలర్‌ కొని ద్విచక్ర వాహనంపై ఇలా తీసుకెళ్తూ కనిపించారు.

స్పెషల్‌ పాటల బాట పట్టిన తమన్నా..!

శ్రీలంక.. సిద్ధమా..!

అక్షయ్‌కుమార్‌ నాగిని డ్యాన్స్‌

Eenadu.net Home