చిత్రం చెప్పే విశేషాలు

(04-05-2024/1)

నల్గొండ జిల్లా మునుగోడు మండలం కొంపల్లి గ్రామానికి చెందిన ఓ రైతు క్షేత్రంలోని మామిడి చెట్టుకు ఏ కొమ్మకు చూసిన గుత్తులు గుత్తులుగా కాయలు ఉన్నాయి. ద్రాక్షా గుత్తులవలె ఉన్న మామిడి కాయలను చూసి పలువురు ఆశ్చర్యానికి గురవుతున్నారు. 

మండుతున్న ఎండల కారణంగా ప్రతి ఒక్కరూ చల్లగా ఉండేందుకు ఈతపై ఆసక్తి చూపుతున్నారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని స్విమ్మింగ్‌ పూల్స్, పంట కాల్వల వద్ద ఎక్కడ చూసినా సందడి కనిపిస్తోంది. ఉదయం, సాయంత్రం వేళల్లో అక్కడ ఈత కొడుతూ చిన్నారుల నుంచి పెద్దల వరకు సేద తీరుతున్నారు. 

పార్లమెంటు ఎన్నికల్లో పోలింగ్‌ శాతం పెంచేందుకు అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కరీంనగర్‌ జిల్లా గోదావరిఖని నగరపాలక సంస్థ కార్యాలయ సమీపంలోని అంబేడ్కర్‌ చౌరస్తాలో ఏర్పాటు చేసిన ఈవీఎం, వీవీప్యాట్‌ నమూనాలు ఆకట్టుకుంటున్నాయి. 

భానుడి భగభగతో ప్రతి ప్రాణి అల్లాడిపోతోంది. ఓ వైపు పెద్ద పెద్ద చెట్లు ఎండిపోయి మోడువారిపోయాయి. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం గానుగుబండ చెరువులో సూర్యోదయ వేళ కలువ పుష్పాలు పరిమళించడంతో అక్కడి ప్రాంతం సుందర వనాన్ని తలపిస్తోంది. 

ఇల్లెందు పట్టణంలోని సీఎస్‌ఐ చర్చి ఏరియాలో కోర్టు ఏరియా నుంచి నెహ్రూనగర్‌ వరకు ప్రధాన రహదారి వెడల్పు కోసం ఎడమ వైపు తవ్వకం పనులు చేపట్టారు. ఈ క్రమంలో సీఎస్‌ఐ చర్చి వద్ద పైపులైన్‌ పగిలి ఒక్కసారిగా భారీ ఎత్తున నీరు పొంగిపొర్లింది. సుమారు గంటన్నర వరకు వృథాగా పోయాయి. 

శ్రీకాకుళం జిల్లా ఎల్‌ఎన్‌పేట మండలంలో వంశధార నది వద్ద మెగా రక్షిత మంచినీటి పథకం బావుల నుంచి నీరు సరఫరా చేసే వంతెన శిథిలమైంది. ఇటీవల గ్రామీణ మంచినీటి సరఫరా విభాగం అధికారులు తాత్కాలికంగా ఇసుక బస్తాలను గోడలుగా ఏర్పాటు చేశారు. 

దివ్యాంగులు, వృద్ధులకు ఇంటి వద్ద ఓటు వేసే ప్రక్రియ మొదలైంది. పలువురు ఓటు హక్కు వినియోగించుకున్నారు. దిల్‌సుఖ్‌నగర్, న్యూమలక్‌పేటకు చెందిన దివ్యాంగులు శంకర్, సైదాబాద్‌లో 89 ఏళ్ల వృద్ధురాలు నాగమణెమ్మ వారి వారి ఇళ్ల వద్ద ఓటు వేస్తున్న దృశ్యాలివి.

ఖమ్మం జిల్లా వైరాలోని క్రాస్‌రోడ్డులో కనిపించిన దృశ్యమిది. అప్పుడే కొనుగోలు చేసిన బేషిన్‌తో ఇంటికెళ్తున్న ఓ వ్యక్తి ఎండ తాళలేక నెత్తిపై పెట్టుకుని ఇలా నెమ్మదిగా వెళ్తుండగా ‘న్యూస్‌టుడే’ క్లిక్‌మనిపించింది.

రోజు రోజుకు ఎండల తీవ్రత పెరుగుతోంది. వడగాల్పులు, ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రత్యామ్నాయంగా ప్రయాణ సమయంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చల్లని కళ్లద్దాలు, మాస్కులు, టోపీలు, బ్యాటరీ ఫ్యాన్లు, వినూత్నమైన శిరస్త్రాణం వినియోగిస్తున్నారు.

ఎండలు మండుతున్నాయి. మెహిదీపట్నం బస్టాప్‌లో ఫ్యాన్లు, ఏసీలు పనిచేయడం లేదు. ఉక్కపోతతో ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. బస్సుల కోసం వేచిచూస్తున్నారు. సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 

చిత్రం చెప్పే విశేషాలు (18-05-2024/2)

చిత్రం చెప్పే విశేషాలు (18-05-2024/1)

ప్రపంచాన్ని తలకిందులుగా చూద్దామా!

Eenadu.net Home