చిత్రం చెప్పే విశేషాలు

(05-05-2024/1)

విజయవాడకు చెందిన 26 మంది చిత్రకారులు గీసిన అందమైన చిత్తరువులు హైదరాబాద్‌.. మాదాపూర్‌లోని స్టేట్‌ ఆర్ట్‌ గ్యాలరీలో కొలువుదీరాయి. ఈ ప్రదర్శన 13 వరకు కొనసాగనుంది.

భారీ వర్షాల ధాటికి బ్రెజిల్‌ను వరదలు ముంచెత్తుతున్నాయి. దేశ దక్షిణ ప్రాంతంలోని రియో గ్రాండ్ డి సుల్‌ రాష్ట్రం అతలాకుతలమైంది. ఈ వరదల్లో పలువురు ప్రాణాలు కోల్పోగా.. మరికొంత మంది నిరాశ్రయులయ్యారు. వారందరినీ పునరావాస కేంద్రాలకు తరలించారు.

ఇనుపవ్యర్థాలతో తీర్చిదిద్దిన ఎద్దుల బండి.. జీవకళ ఉట్టిపడేలా వివిధ శిల్పాలు మాదాపూర్‌లోని చిత్రమయి స్టేట్‌ ఆర్ట్‌ గ్యాలరీలో కనువిందు చేస్తున్నాయి. విజయవాడకు చెందిన శిల్పి శ్రీహర్ష త్రీడి సాంకేతికతతో మలిచిన ఈ బొమ్మల ప్రదర్శనను సినీ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ప్రారంభించారు. 

కర్నూలు నగరం 19వ వార్డు పరిధిలోని గణేశ్‌ నగర్‌లో జనం తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రెండు రోజులకోసారి వచ్చే ఒక్క ట్యాంకర్‌ నీరు ఏమాత్రం సరిపోవడం లేదు. ఈ నీటిని పట్టుకునేందుకు ఒకరినొకరు తోసుకోవాల్సిన పరిస్థితి. 

ఈసీఆర్‌ రోడ్డులోని ‘తమిళనాడు టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌’ ఆధ్వర్యంలో పర్యాటకులను ఆకర్షించేందుకు సరికొత్త డబుల్‌ డెక్కర్‌ ఫ్లోటింగ్‌ రెస్టారెంట్అందుబాటులోకి రానుంది. ఈ పడవను రూ.5 కోట్లతో 125 అడుగుల పొడవు, 25 అడుగుల వెడల్పు ఉంది.

ఎన్నికలు సమీపిస్తున్న వేళ నిజామాబాద్‌ జిల్లా మాచారెడ్డి మండలం లక్ష్మీరావులపల్లిలో వినూత్న పోస్టర్‌ శనివారం ఉదయం దర్శనమిచ్చింది. ‘మాట ఇవ్వండి - ఓట్లు అడగండి’ పేరిట ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఎంపీ అభ్యర్థులు తమ గ్రామాన్ని దత్తత తీసుకోండి అంటూ సమస్యలను వెలుగులోకి తెచ్చారు.

ఖమ్మం జిల్లా వైరా జలాశయం వద్ద ఉదయం వేళల్లో ఈత కొట్టేందుకు వస్తున్న వారి సంఖ్య క్రమేపి పెరుగుతోంది. మండుతున్న ఎండలు తాళలేక జలాశయం గుట్టల వద్ద ఈత కొడుతున్నారు. మరోవైపు సెలవులు కావడంతో చిన్నారులు, విద్యార్థులు సైతం ఈత నేర్చుకునేందుకు వస్తున్నారు. 

ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో నిర్వహించిన కాంగ్రెస్‌ జనజాతర సభకు హాజరైన కార్యకర్తలు, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా మిస్ట్‌ (వాటర్‌ స్ప్రే) ఫ్యాన్లు ఏర్పాటుచేశారు. ఇవి చల్లదనం కోసం తుంపర్లుగా నీటిని వెదజల్లటంతో సభికులు ఉపశమనం పొందారు. 

చిత్రం చెప్పేవిశేషాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు

Eenadu.net Home