చిత్రం చెప్పే విశేషాలు

(05-05-2024/2)

ఈ ద్విచక్ర వాహనం హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై ‘ఈనాడు’ కెమెరాకు చిక్కింది. మాదన్నపేట వాసి మహ్మద్‌ సలీమ్‌ వాహనానికి పలు రంగుల్లో 500 ఎల్‌ఈడీ లైట్లను, వైఫై సాయంతో వీడియోలు వీక్షించేలా ముందుభాగంలో ల్యాప్‌టాప్‌ స్క్రీన్‌ ఏర్పాటు చేయించాడు. 

సూటేసుకుని టిప్‌టాప్‌గా రెడీ అయి తాగునీరు అందిస్తున్న ఇతడు బంజారాహిల్స్‌లోని ‘తాజ్‌కృష్ణ’ ఉద్యోగి. హోటల్‌ యాజమాన్యం ఏర్పాటు చేసిన చలివేంద్రంలో ఇలా విధులు నిర్వర్తిస్తున్నారు.

రోజు రోజుకు భానుడు ప్రతాపం చూపుతున్నాడు. మండుతున్న ఎండలతో జనం బెంబేలెత్తుతున్నారు. తప్పనిసరి బయటకు వెళ్లాల్సి ఉన్నా జంకుతున్నారు. దీంతో వరంగల్ నగరంలోని ప్రధాన రహదారులు సైతం నిర్మానుష్యంగా మారుతున్నాయి.

నల్గొండలోని పీఏపల్లికి చెందిన ఓ రైతు మిరప చేనులో పంటను తెంపేందుకు బాలాజీనగర్‌ గిరిజన కూలీలు వినూత్నంగా వచ్చారు. ఎండ తగలకుండా చల్లగా ఉండేందుకు కానుగ ఆకుల మండలు తలకు బుట్టలా కట్టుకుని మిరపకాయలు కోశారు.

కడప జిల్లా జమ్మలమడుగు పట్టణం ఎత్తపువారికాలనీలోని ఓ ఇంటి ముందు ‘ఈ ఇంట్లో ఓట్లు అమ్మబడవు’ అంటూ ముద్రించిన పోస్టర్‌ కట్టారు. ప్రభుత్వ ఉద్యోగి విద్యాసాగర్‌ ఓటు అమ్ముకోవద్దు అంటూ ఓటు విలువ ప్రాముఖ్యతను నేతలతో పాటు ఓటర్లకు చెప్పాలనే బోర్టు పెట్టాం అన్నారు.

నెల్లూరు జిల్లా గుడ్లూరు ఉన్నత పాఠశాల కూడలిలో ఐదుగురు ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తూ ఇలా కనిపించారు. ఎక్కువ మంది ఉండటంతో ప్రమాదం జరిగితే పరిస్థితి ఏమిటని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.

తిరునగరిలో మాస్టర్‌ ప్లాన్‌ రోడ్లు అద్భుతాలని గొప్పలు చెబుతున్న ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి, ఆయన కుమారుడు, వైకాపా అభ్యర్థి అభినయ్‌రెడ్డిలు ఓసారి అక్కడ రోడ్లు ఎలా ఉన్నాయో.. చూడాలని ప్రజానీకం కోరుతోంది. చిన్నపాటి వర్షానికి ఈ దుస్థితి నెలకొనడాన్ని అందరూ తప్పుబడుతున్నారు.  

జామచెట్టుకు జామ, సపోటా చెట్టుకు సపోటాలే కాస్తాయి. చెట్టొకటి అయితే పండు ఇంకొకటి రాదు. కానీ.. శాస్త్రవేత్తలు ఆస్ట్రేలియాలో ఎక్కువ అంట్లు కట్టడం (మల్టీ గ్రాఫ్టెడ్‌) అనే పద్ధతిలో ఒక చెట్టుకు ఆరు రకాల పండ్లు వచ్చేలా అభివృద్ధి చేశారు. వీటిని ‘ఫ్రూట్‌ సలాడ్‌ ట్రీస్‌’ అంటారు. 

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీలోని వివిధ ప్రాంతాల్లో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్ కొనసాగింది. ఉద్యోగులు ఉదయం 7 గంటల నుంచి పోలింగ్‌ బూత్‌ వద్ద లైన్‌లో నిల్చొని ఓటు హక్కును వినియోగించుకున్నారు. 

దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్‌ పరీక్ష జరిగింది. దీంతో పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థులు, తల్లిదండ్రులతో సందడి వాతావరణం నెలకొంది.

మై హార్ట్‌ ఈజ్‌ మిస్సింగ్‌

వైట్‌ ఎండ్‌ వైట్‌లో అలా..

చిత్రం చెప్పే విశేషాలు (19-05-2024/1)

Eenadu.net Home