చిత్రం చెప్పే విశేషాలు

(06-05-2024/1)

తెదేపా ఆధ్వర్యంలో  ఏలూరులో యువగళం సభ నిర్వహించారు.  సభకు హాజరైన యువతతో నారా లోకేశ్‌  సెల్ఫీ తీసుకున్నారు.

బెంగళూరు నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో బ్రిడ్జ్‌ స్టోన్‌ సంస్థ తయారు చేసిన కొత్త డ్యులెర్‌ టైర్‌ను ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధు ఆవిష్కరించారు. 360 డిగ్రీలు కలిగిన ఎస్‌యూవీ, దీర్ఘకాలం మన్నికతో ఐదు రిబ్‌ సాంకేతిక పరిజ్ఞానంతో టైర్‌ను తయారు చేసింది.

నూజివీడులో తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి కొలుసు పార్థసారథి కుండ తయారు చేసే విధానాన్ని స్వయంగా పరిశీలించి.. తానే స్వయంగా కుండ తయారు చేశారు.  

పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం లోక్‌సభ స్థానం ఎన్డీయే అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాసవర్మ, వైకాపా ఎంపీ అభ్యర్థి గూడూరి ఉమాబాల పాలకొల్లులో జరిగిన ఒక కార్యక్రమంలో ఎదురు పడ్డారు. సోదరభావంతో ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకుంటుండగా ‘న్యూస్‌టుడే’ తీసిన చిత్రమిది.

ఎన్నికల ప్రచారంలో భాగంగా తెదేపా నేత అయ్యన్నపాత్రుడు అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఎన్టీఆర్‌ మినీ స్టేడియంలో వాలీబాల్‌ క్రీడాకారులతో కలిసి కొద్దిసేపు ఆడారు.  

మైలవరంలో తెదేపా ప్రచారరథంపై ఉన్న ఎన్టీఆర్‌ బొమ్మను చూసి, దారినపోతున్న ఓ వృద్ధుడు ఆగి దండం పెట్టాడు. అన్నగారిపై, తెదేపాపై తనకున్న అభిమానాన్ని చాటాడు.  

విజయవాడ పశ్చిమ నియోజకవర్గ భాజపా ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి భవానీపురంలో ఆటో నడిపి సందడి చేశారు.  

భారీ వర్షాల కారణంగా అమెరికాలోని టెక్సాస్‌ రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తాయి. ప్రధానంగా హ్యూస్టన్‌ నగరంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో వీధుల్లో నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో పలువురు ఇళ్లలో బిక్కుబిక్కుమంటూ గడిపారు. కొంతమంది ఇళ్లపైకి ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నారు. 

దెందులూరు తెదేపా అసెంబ్లీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్‌ అప్పనవీడులోని ఓ హోటల్‌ వద్ద ఆగి దోసెలు వేశారు.  

ప్రపంచాన్ని తలకిందులుగా చూద్దామా!

వినూత్నంగా చెప్పిన విశ్వక్‌సేన్‌..

చిత్రం చెప్పే విశేషాలు (17-05-2024/1)

Eenadu.net Home