చిత్రం చెప్పే విశేషాలు

(08-05-2024/1)

ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ప్రధాని మోదీ పర్యటించారు. సభ ప్రారంభానికి ముందు వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామిని ప్రధాని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఏర్పాటు చేసిన సభలో ఓ చిన్నారి ప్రధాని మోదీ బాలరాముడిని దర్శించుకున్న పెయింటింగ్‌ చూపిస్తూ కనిపించింది

ఈదురు గాలులు.. ఉరుములు, మెరుపులతో యాదాద్రి దివ్యక్షేత్రం ప్రత్యేకంగా కనిపించింది. ఆలయం గగనతలంలో భారీగా మెరుపులు మెరవడంతో ఆ వెలుగుల్లో నల్లరాతి కట్టడాలు భక్తులకు కనువిందు చేశాయి.

కర్నూలు జిల్లా దేవనకొండ మండలం భైరవకుంట గ్రామంలో కురిసిన భారీ వర్షానికి 3 కేజీల బరువు ఉన్న వడగండ్లు పడ్డాయి.

సికింద్రాబాద్‌ లోక్‌సభ భారాస అభ్యర్థి పద్మారావుగౌడ్‌ నాంపల్లి నియోజకవర్గంలో రోడ్‌షోలో పాల్గొన్నారు. ఓటర్లకు కారు బొమ్మను చూపిస్తూ భారాసకు ఓటేయాల్సిందిగా స్థానికులను అభ్యర్థించారు. 

మల్కాజిగిరి లోక్‌సభ భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్‌ మంగళవారం కీసరలో వర్షంలోనూ ప్రచారం కొనసాగించారు.  

మాజీ గవర్నర్‌ తమిళిసై బంజారాహిల్స్‌ ఎమ్మెల్యే కాలనీ ఓటర్లకు రామ మందిర నమూనాలను కానుకగా అందించారు. సికింద్రాబాద్‌ లోక్‌సభ అభ్యర్థి జి.కిషన్‌రెడ్డికి మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నారు. 

ప్రపంచాన్ని తలకిందులుగా చూద్దామా!

వినూత్నంగా చెప్పిన విశ్వక్‌సేన్‌..

చిత్రం చెప్పే విశేషాలు (17-05-2024/1)

Eenadu.net Home