చిత్రం చెప్పే విశేషాలు

(09-05-2024/1)

కరీంనగర్‌ జిల్లా వీణవంక వాగుపై పంటల సాగుకు ఉపయోగపడే విధంగా చెక్‌డ్యాంలు నిర్మించారు. యాసంగి సీజన్‌ వచ్చిందంటే నీరు అందకపోవడం కనిపించేది కానీ.. ప్రస్తుతం మే మాసంలోనూ వీణవంక చెక్‌డ్యాం జలకళ సంతరించుకొని నిండుకుండలా కనిపిస్తోంది.  

బ్రెజిల్‌లో వరద బీభత్సం కొనసాగుతూనే ఉంది. భారీ వర్షాల ధాటికి  దేశ దక్షిణ ప్రాంతంలోని రియో గ్రాండ్ డి సుల్‌ రాష్ట్రం అతలాకుతలమైంది. ఈ వరదల్లో పలువురు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు నిరాశ్రయులయ్యారు. వారందరినీ పునరావాస కేంద్రాలకు తరలించారు. 

హైదరాబాద్‌లో భారీ అంబేడ్కర్‌ విగ్రహం చెంత ఓటర్లలో చైతన్యం కోసం ‘‘మై ఓట్‌ కౌంట్స్, ఐ ఓట్‌ ఫర్‌ ష్యూర్‌’ నినాదాలతో ఉన్న భారీ బెలూన్‌ ఏర్పాటుచేశారు. అటుగా వెళ్లే వారిని విశేషంగా ఆకట్టుకుంటోంది.

మామునూరు విమానాశ్రయం నుంచి ఓరుగల్లు జనసభకు వెళ్తూ లక్ష్మీపురంలో ఓ ఇంటి గేటు లోపల తల్లి చేతిలో ఉన్న బాలుడిని చూసిన ప్రధాని మోదీ తన వాహనాన్ని ఆపించారు. డోరు తెరిచి ఆమెను పిలిచి చిన్నారిని చేతుల్లోకి తీసుకుని ఆడించారు.

రాజస్థాన్‌లో జోధ్‌పుర్‌కు చెందిన తల్లీకొడుకులు చంద్రాదేవి, మోహన్‌లాల్‌ మూడు నెలలు కష్టపడి మధుబని కళను జోడించి ఎంబ్రాయిడరీ డిజైనుతో 8.5 అడుగుల బాహుబలి జోళ్లు కుట్టారు. ప్రపంచ రికార్డులో నమోదుకు వీరు ఈ ప్రయత్నం చేశారు. వీటి తయారీకి రూ.1.5 లక్షల ఖర్చయింది.

ప్రపంచ శాంతి కోసం నిర్విరామంగా కృషి చేస్తున్న ప్రముఖ బౌద్ధ గురువు దలైలామాకు పీవీ నరసింహారావు మెమోరియల్‌ ఫౌండేషన్‌ ‘భారతరత్న పీవీ నరసింహారావు స్మారక పురస్కారా’న్ని అందించింది. హిమాచల్‌ప్రదేశ్‌లోని ధర్మశాలలోని దలైలామా నివాసంలో ఆయనకు పురస్కారాన్ని అందించి సత్కరించారు.

మధిరకు చెందిన ఉప్పతల నాగేశ్వరరావు ఫౌండ్రీ విభాగంలో పనిచేస్తుంటారు. వేసవి ఎండల నుంచి రక్షణ పొందేందుకు సొంతంగా తన వాహనానికి రక్షణ ఛత్రాన్ని ఏర్పాటు చేసుకున్నారు. వర్షాకాలంలోనూ ఇది ఉపయోగపడుతుందని, దీని కోసం రూ.15 వేలు ఖర్చయ్యాయని వివరించారు.

వేసవి సెలవుల సందడి కోసమే అన్నట్లు బెంగళూరు నగరవాసులకు మరో కొత్త వినోద కేంద్రం అందుబాటులోకి వచ్చింది. స్థానిక ప్యాలెస్‌ మైదానంలో సుమారు 50 అడుగుల ఎత్తు నుంచి నీరు దిగువకు దూకేలా కృతిమ జలపాతం తీర్చిదిద్దారు. 

చిత్రం చెప్పే విశేషాలు (18-05-2024/1)

ప్రపంచాన్ని తలకిందులుగా చూద్దామా!

వినూత్నంగా చెప్పిన విశ్వక్‌సేన్‌..

Eenadu.net Home