చిత్రం చెప్పే విశేషాలు
(10-05-2024/1)
మనుషులంతా ఒక్కటేనని చాటిచెప్పిన మహాత్ముడు విశ్వగురు బసవేశ్వరుడు. ఆయన జయంతిని పురస్కరించుకుని సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌కు చెందిన పత్ర చిత్రకారుడు గుండు శివకుమార్ రావి ఆకుపై చిత్రాన్ని మలిచి శుభాకాంక్షలు తెలిపారు.
ఖమ్మం జిల్లా చింతకాని మండల పరిధిలోని కొదుమూరు రామలింగేశ్వరస్వామి చెరువులో చేపలవేట గురువారం కొనసాగింది. మత్స్యకారుడు బోళ్ల శ్రీకాంత్ వలలో 20కిలోల రవ్వ రకం చేప చిక్కింది. ఇటీవలి కాలంలో ఇంతపెద్ద చేపలు లభ్యం కాలేదని మత్స్యకారులు పేర్కొన్నారు.
విశాఖ జిల్లాలో మే పుష్పాలు కనువిందు చేస్తున్నాయి. ఊటీ, సిమ్లా, కశ్మీర్ వంటి అతి శీతల ప్రాంతాలకే పరిమితమైన మే పుష్పాలు కాలక్రమంలో మన్యం అంతటా విస్తరించాయి. కొద్దిరోజులుగా వర్షాలు పడుతుండటంతో ఈ పుష్పాలు వికసించి అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
ఎన్నికల ప్రచారంలో భాగంగా నారా బ్రాహ్మణి ఉండవల్లిలో పర్యటించారు. ఈ సందర్భంగా కృష్ణానదిలో మత్స్యకారుల వలలో చిక్కిన చేపను పరిశీలించారు.
ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలోని ఎన్‌ఆర్‌సీలో చేరే చిన్నారులకు వేడిమి నుంచి ఉపశమనం కలిగించటానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. చల్లని నీటి కోసం ఫ్రిజ్ సైతం అందుబాటులో ఉంచారు. ఆ కేంద్రంలో చల్లని వాతావరణం ఏర్పడి పిల్లలు త్వరగా కోలుకునేలా ఏర్పాట్లు చేశారు.
తాము పండించిన కూరగాయలను మార్కెట్‌కు తరలించే క్రమంలో మిట్టమధ్యాహ్నం భానుడి ధాటికి తట్టుకోలేక గొడుగు నీడలో కొంగుచాటున వాహనంపై ప్రయాణిస్తున్న రైతులు. హైదరాబాద్‌లోని లక్డీకపూల్ వద్ద కనిపించిన చిత్రమిది.
మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఎన్నికల ప్రచారంలో అభిమానులను సెల్ఫీలతో అలరించారు. యాకుత్‌పుర అసెంబ్లీ సెగ్మెంట్‌లోని కుర్మగూడలో పాదయాత్ర చేసి ఓటర్లను కలుసుకున్నారు.
విశాఖపట్నంలోని బుచ్చిరాజుపాలేనికి చెందిన ఇంటూరి భూషణం సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకుని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ... విశాఖ వీధుల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తూ.. పలువురిని ఆలోచింపజేస్తున్నారు.