చిత్రం చెప్పే విశేషాలు

(11-05-2024/1)

అక్షయ తృతీయను పురస్కరించుకుని స్వర్ణాభరణాల దుకాణాలు కొనుగోలుదారులతో కళకళలాడాయి. బంగారం ధరలు పెరిగినా.. శుభసూచకమన్న నమ్మకంతో పలువురు తరలివచ్చారు. నెల్లూరులోని ఓ దుకాణంలో నగల ఎంపికలో యువతులు నిమగ్నమయ్యారు.

మన దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను పటిష్ఠం చేసే, మన భవితను తీర్చిదిద్దే ఓటుకు రమ్మని వినూత్న పద్దతిలో రూపొందించిన ఆహ్వాన పత్రిక సామాజిక మాధ్యమాల గ్రూపుల్లో చక్కర్లు కొడుతోంది.

తమిళనాడులోని నీలగిరి జిల్లా ఊటీలో 126వ పుష్ప ప్రదర్శన ప్రారంభమైంది. పుష్పాలతో అలంకరించిన ఏనుగు, ఊటీ మౌంటెయిన్‌ రైలు, డిస్నీ వరల్డ్, సింహంతో పాటు పలు జంతువుల కళారూపాలు సందర్శకులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. 

మండే ఎండలతో పట్టణాల్లోని చిరువ్యాపారులు అల్లాడిపోతున్నారు. ఖమ్మం జిల్లా పాల్వంచ పట్టణం శాస్త్రి బొమ్మ వద్ద జామ, బొప్పాయి పండ్లు విక్రయించే చిరు వ్యాపారులు ఎండల తీవ్రతను తట్టుకోలేక ఇలా తాటాకులతో చలువ పందిరి వేసుకున్నారు.

గుంటూరు జిల్లా కొల్లిపర మండలం అత్తోట గ్రామ కౌలు రైతులు ఎన్డీయే కూటమి పట్ల తమకున్న అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నారు. ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థుల విజయం కోరుతూ కూటమి నినాదం ‘ప్రతిచేతికి పని.. ప్రతిచేనుకు నీరు’ను వ్యవసాయ క్షేత్రంలో సాక్షాత్కరించారు

పవిత్ర అక్షయ తృతీయ పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రముఖ శిల్పి సుదర్శన్‌ పట్నాయక్‌ పూరీ తీరంలో రథాల తయారీ పనులు మంగళప్రదమవ్వాలని, అందరికీ శుభాలు చేకూరాలన్న సందేశంతో సైకత శిల్పం తీర్చిదిద్దారు. 

ఆదిలాబాద్‌ శ్రీనగర్‌కాలనీలో నివాసముండే చిందం లత - రమేష్‌ దంపతుల ఇంట్లో మే పుష్పం వికసించింది. తమ ఇంటి ఆవరణలో సంవత్సరానికి ఒకసారి మే నెలలోనే కనిపించే మే పుష్పం పూయడంతో ఆనందం వ్యక్తం చేశారు. 

చల్లని జలవేణి.. కావేరి మాత కానరాని దయనీయ పరిస్థితి. నిత్యం నీటి గలగలలతో కళకళలాడే జలదేవేరి అడుగంటి పోయింది. కర్ణాటక రాష్ట్రంలో వానలు కురిసినా గానీ.. మైసూరు- చామరాజనగర జిల్లాల సరిహద్దుల్లోని సత్తెగాల ప్రాంతంలో నదీమతల్లి నిర్జీవంగా కానవచ్చిందిలా.. 

చిత్రం చెప్పేవిశేషాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు

Eenadu.net Home