చిత్రం చెప్పే విశేషాలు

(12-05-2024/1)

ఒడిశా రాష్ట్రంలో ప్రధాని మోదీ పర్యటించారు. ఈ సందర్భంగా పుల్బాణీ సభలో పూర్ణమాసి జాని అనే వృద్ధురాలితో మోదీ ముచ్చటించారు.

ఓటుహక్కు ఆవశ్యకతను వివరిస్తూ ఖమ్మం నగరంలోని వివిధ కూడళ్లలో నిలువెత్తు బ్యాలెట్‌ యూనిట్ల ఫ్లెక్సీలు అమర్చారు. తప్పనిసరిగా ఓటేయాలని ప్రజలను చైతన్యపరుస్తున్నారు. 

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మైదానంలో సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థులతో కలిసి సరదాగా ఫుట్ బాల్ ఆడారు.

విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని లయోల కళాశాలలో మహిళా (పింక్‌) పోలింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.

పిఠాపురంలో ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్టు బాధితుడు కొమ్మూరి గంగాధర్‌తోపాటు జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఫ్లెక్సీ ప్రదర్శనలో పాల్గొన్నారు. 

ప్రకృతే వేసిందా అన్నట్లు కనిపిస్తున్న ఈ చిత్రం ఆదిలాబాద్‌ జిల్లా బజార్‌హత్నూర్‌ మండలం చందునాయక్‌ తండా వద్ద ఆవిష్కృతమైంది.  తీవ్ర గాలులతో కూడిన వర్షం కురిసి ఆగిన తర్వాత ఆకాశంలో ఇంద్రధనస్సు కనువిందు చేసింది. 

ఓట్లు కొనుగోలు చేయడానికి అభ్యర్థులు పోటీపడుతున్న నేపథ్యంలో గుంటూరు అమరావతిరోడ్డు, బాలాజీనగర్‌ 2వ వీధికి చెందిన నేతాజీ తన ఇంటి ప్రధాన ద్వారం వద్ద గేటుకు ‘మా ఇంటిలోని ఓట్లు అమ్మబడవు’ అని బోర్డులు ఏర్పాటు చేశారు.

ఆయన పేరు రాజమోహన్‌. గుంటూరు గ్యాస్‌ కంపెనీలో చిరుద్యోగిగా పనిచేస్తున్నారు. వేసవి ఎండల్లో ప్రజలకు చల్లని నీరు ఇచ్చి వారి దాహం తీరుస్తూనే ఓటుపై అవగాహన కల్పిస్తున్నారు. తప్పకుండా ఓటు వేయాలని, నోటుకు, మద్యానికి దాన్ని అమ్ముకోవద్దని కోరుతున్నారు.

ఇప్పటివరకు ఇంటింటి ప్రచారాలతో ఆకట్టుకున్న సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ అసెంబ్లీ ఉపఎన్నిక భారాస అభ్యర్థి నివేదిత ప్రచారం చివరి రోజు బైకు ర్యాలీలో పాల్గొన్నారు. గాంధీ నగర్‌ నుంచి కార్యకర్తలు పెద్దఎత్తున నిర్వహించారు.  

డిచ్‌పల్లి-నిజామాబాద్‌ ప్రధాన రహదారి నడ్‌పల్లి సమీపంలో రోడ్డు పక్కనున్న రావి చెట్టు ఆకులు గత నెల 22వ తేదీన పూర్తిగా ఊదా రంగులో ఉండి వాహనదారులను కనువిందు చేసింది. సరిగ్గా 20 రోజుల్లోనే వృక్షం ఆకులు మొత్తం పచ్చదనం సంతరించుకొని ఆహ్లాదం పంచుతోంది. 

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

Eenadu.net Home