చిత్రం చెప్పే విశేషాలు

(16-05-2024/1)

ఇది ఉమ్మడి వరంగల్‌ జిల్లాతో పాటు సూర్యాపేట జిల్లాకు సాగు, తాగునీరు అందించే శ్రీరామసాగర్‌ ప్రాజెక్టు(ఎస్సారెస్పీ) కాకతీయ కాలువ. అడుగడుగునా లైనింగ్‌ ధ్వంసమై రాళ్లు తేలడంతో కాల్వ పరిస్థితి అధ్వానంగా మారింది. దీంతో నీటిపారుదలకు ఆటంకం ఏర్పడుతోంది.

భానుడి భగభగలు కొనసాగుతుండటంతో జనమే కాదు జంతువులు సైతం ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. మూగజీవాలు దాహార్తితో అలమటిస్తున్నాయి. హైదరాబాద్‌ లంగర్‌హౌస్‌లోని హెచ్‌పీ పెట్రోల్‌ బంక్‌లో వాటర్‌ ట్యాంకు వద్ద ఓ వీధిశునకం నీటిని తాగుతుండగా ‘న్యూస్‌టుడే’ కెమెరా క్లిక్‌మనిపించింది. 

మెదక్‌ జిల్లా రామాయంపేట మండల పరిధి తొనిగండ్ల అటవీ ప్రాంతంలో ఎండకు తాళలేక చిరుత పులి నీళ్లు తాగడానికి వచ్చి అటవీ శాఖ ఏర్పాటు చేసిన కెమెరాలకు చిక్కింది.

విశాఖ జిల్లా పెదవాల్తేరులోని జీవ వైవిధ్య ఉద్యానవనంలో చక్కగా పూసిన ఎడారి మొక్కల పూలు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. సందర్శకులు వీటిని చూసి తమ చరవాణుల్లో బంధిస్తున్నారు.

ఏ కాలమైనా ఆ పల్లె పచ్చదనంతో నిండి ఉంటుంది. కరీంనగర్‌ జిల్లా జగిత్యాల పట్టణంలోని శంకులపల్లెలో నిత్యం కూరగాయలు సాగుచేస్తూ ఆదాయం పొందుతున్నారు. మండు వేసవి అయినప్పటికీ పంట పొలాలతో గ్రామానికి వెళ్లే వారికి ఆహ్లాదం పంచుతోంది.

 హైదరాబాద్‌ నగరంలో వేసవి ఎండలు బెంబేలెత్తిస్తున్నాయి. పిల్లలు ఎండల్లో తిరగకుండా ఇంటి పట్టునే ఉండాలని ఓ దంపతులు సైకిల్‌ కొని ద్విచక్రవాహనంపై తీసుకెళ్తూ కనిపించారు.   

గోవా రాష్ట్రానికి చెందిన చిత్రకారులు తీర్చిదిద్దిన అందమైన బొమ్మలు హైదరాబాద్‌ మాదాపూర్‌లోని చిత్రమయి స్టేట్‌ ఆర్ట్‌ గ్యాలరీలో కొలువుదీరాయి. చిత్రకారులు తమ మదిలో మెదిలిన భావాలను చూడముచ్చటగా ఆవిష్కరించిన తీరు కళాప్రియులను ఆకట్టుకుంటోంది.

హాంకాంగ్‌లోని చెవుంగ్‌ చవ్‌ దీవిలో బన్నుల వేడుకను నిర్వహించారు. స్తంభాన్ని ఎక్కి నిర్ణీత వ్యవధిలో ఎక్కువ సంఖ్యలో బన్నులు చేజిక్కించుకున్న వారిని విజేతలుగా ప్రకటించారు.

 ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం తూర్పుగంగవరం పంచాయతీ పరిధి కొత్త లింగాలపాడు ఎస్సీ కాలనీవద్ద పైపునకు మూత బిగించకపోవడంతో నీరంతా రోడ్డు పాలవుతోంది. మాధవరంలో దాదాపు నెల రోజుల నుంచి మంచినీరు ఎగజిమ్ముతోంది

ద్విచక్ర వాహనంపై గొడుగు ఏర్పాటు చేసుకుంటే వేసవిలో ప్రయాణం భలే హాయిగా ఉంటుంది. ఈ ఆలోచన విశాఖ జిల్లా పాయకరావుపేట మండలంలోని నామవరానికి చెందిన రహమాన్‌కు వచ్చింది. కొద్దిపాటి ఖర్చుతో ద్విచక్ర వాహనానికి పైన వస్ర్తంతో ఏర్పాట్లు చేశారు. 

స్పెషల్‌ పాటల బాట పట్టిన తమన్నా..!

శ్రీలంక.. సిద్ధమా..!

అక్షయ్‌కుమార్‌ నాగిని డ్యాన్స్‌

Eenadu.net Home