చిత్రం చెప్పే విశేషాలు

(17-05-2024/1)

కామారెడ్డి జిల్లాలో భారీ వర్షం కురిసింది. ఈ వర్షానికి దుబ్బాక మార్కెట్‌ యార్డులో ఆరబోసిన ధాన్యం కొట్టుకుపోయింది. మహిళా రైతులు ఈ ధాన్యాన్ని ఎత్తి పోస్తున్నారు.

77వ కేన్స్‌ చిత్రోత్సవం గురువారం కన్నుల పండువగా ప్రారంభమైంది. ఈ వేడుకలో బాలీవుడ్‌ నటి ఐశ్వర్యరాయ్‌ రెడ్‌కార్పెట్‌పై మెరిశారు. బంగారు, నలుపు తెలుపు రంగుల కలబోతగా ఉన్న గౌను ధరించి ఐశ్వర్యరాయ్‌ ఆకట్టుకుంది.

హైదరాబాద్‌లో గురువారం సాయంత్రం పలు చోట్ల వర్షం కురిసింది. ఈ వర్షం వల్ల వివిధ ప్రాంతాల్లో రోడ్లన్ని జలమయమయ్యాయి. సచివాలయం, ఖైరతాబాద్‌, ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌, తదితర ప్రాంతాల్లో భారీగా వర్షం కురిసింది. వరద నీటికి ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు.

సిద్దిపేట మార్కెట్‌యార్డులో ధాన్యం కోసం ఖాళీ సంచులు తెచ్చి పెట్టారు. యార్డులో అక్కడక్కడా పడిన వడ్ల గింజలను ఏరుకొని తినటానికి సమూహంగా పావురాలు ఎగిరివచ్చాయి. ఒక్కసారిగా వర్షపు చినుకులు పక్షుల మీద పడటంతో అవి ఎగిరి పోయాయి.

ఖమ్మం జిల్లా తల్లాడ-సత్తుపల్లి ప్రధాన రహదారిలో తల్లాడకు సమీపంలోని ఓ మామిడి తోటలో చెట్టు కొమ్మను నరికారు. గొడ్డలి కాటు వద్దనే ఆ కొమ్మ చిగురించి కాతపడింది. ఆ కొమ్మకు ఆరు మామిడికాయలున్న దృశ్యాన్ని ‘న్యూస్‌టుడే’ క్లిక్‌ మనిపించింది.

పనస పండ్ల సీజన్‌ వచ్చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో పనసకాయలతో చెట్లన్నీ దర్శనమిస్తున్నాయి. విశాఖ జిల్లా పాడేరు మండలం బిరిమిశాలలో ఒకే చోట ఉన్న రెండు చెట్లకు నిండుగా కాయలు కాశాయి. నేలకు తాకేలా పూతకు రావడంతో పలువురు ఆసక్తిగా తిలకిస్తున్నారు.

నల్గొండ జిల్లా నాంపల్లి మండలకేంద్రంలోని ఓ ఇంటి ఆవరణలో దాహార్తి తీర్చుకోవడానికి కుళాయి వద్ద గిజిగాడు పక్షి నానా తంటాలు పడుతూ చేస్తున్న విన్యాసాలను ‘న్యూస్‌టుడే’ క్లిక్‌మనిపించింది.

విశాఖపట్నం జిల్లా ఎస్‌.రాయవరం మండలం పెదఉప్పలం సమీపాన వరాహానదిలో నూకాంబిక అమ్మవారి రాతి విగ్రహం లభ్యమైంది. నదిలో కొందరు వ్యక్తులు ఎడ్లబళ్లకు ఇసుక తవ్వుతుండగా పురాతన విగ్రహం బయటపడింది.

చిత్రం చెప్పే విశేషాలు

చిత్రం చెప్పేవిశేషాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

Eenadu.net Home