చిత్రం చెప్పే విశేషాలు
(18-05-2024/2)
విజయనగరం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ‘జయంతి’ ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అమ్మవారికి అభిషేకాలు, పూజలు చేశారు. అనంతరం వజ్ర కిరీటంతో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. వేలాది మంది భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు.
ప్రకృతిలో అప్పుడప్పుడు కనిపించే సుందర దృశ్యాలు కమనీయంగా ఉంటాయి. శుక్రవారం సాయంత్రం వేళ నల్గొండ పరిసర ప్రాంతంలో నీలి, ఎరుపు రంగు ఆకాశంతో కూడిన సుందర ప్రకృతి దృశ్యాన్ని ’న్యూస్‌టుడే’ క్లిక్ మనిపించింది.
విజయవాడ నగరం మీదుగా వెళ్లే రెండు జాతీయ రహదారులను (ఎన్‌హెచ్65, ఎన్‌హెచ్16) కలుపుతున్న ప్రసాదంపాడు- కానూరు ప్రధాన రోడ్డు దుస్థితి ఇది. ప్రసాదంపాడు నుంచి కేవలం ఒక కి.మీ దూరంలో అడుగడుగునా ఏర్పడిన గుంతలు వాహనదారులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో పలువురు సినీ దర్శకులు కలిశారు. ఈ నెల 19న డైరెక్టర్స్‌డే సందర్భంగా నిర్వహించే కార్యక్రమానికి రావాలని ఆయన్ను ఆహ్వానించారు. దర్శకులు హరీశ్‌శంకర్, అనిల్ రావిపూడి, వీరశంకర్ తదితరులు సీఎంను కలిశారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం తాడిచెర్లలోని కొనుగోలు కేంద్రంలో ఆరబోసిన ధాన్యం ఇటీవల కురిసిన భారీ వర్షానికి తడిసిపోయింది.
సిద్దిపేట, మెదక్ జిల్లాల్లో హఠాత్తుగా కారుమబ్బులు కమ్ముకున్నాయి. హుస్నాబాద్ మండలంలో వర్షం కురిసింది. చేగుంట మండలం కర్నాలపల్లి ఎల్లమ్మ ఆలయ సమీపంలో ఎండ, చినుకుల కలయికతో ఇంద్రధనుస్సు ఏర్పడి మురిపించింది.
నీలి వర్ణంలో మెరిసిపోతున్న సాగర జలాలు... వాటిపై ప్రయాణిస్తున్న భారీ నౌక... విశాఖ తీరంలో సందర్శకులను ఆకట్టుకున్నాయి.
అనంతపురం జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇటీవల వర్షాలు కురిసి వాతావరణం చల్లబడినా.. ఎండలు మండిపోతున్నాయి. ఎండలు, కీటకాల నుంచి పండ్ల తోటలను కాపాడుకునేందుకు రైతులు చీరలతో, పరదాలతో రక్షణ ఏర్పాట్లు చేసుకున్నారు.
శ్రీవారి దర్శనానికి తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు నిండిపోయాయి. రింగు రోడ్డు మీదుగా శిలాతోరణం వరకు సుమారు 2 కిలోమీటర్ల వరకు క్యూలైన్లలో బారులు తీరారు