చిత్రం చెప్పే విశేషాలు

(27-01-2024/1)

హైదరాబాద్‌ నగరం నాంపల్లిలోని తెలుగు విశ్వవిద్యాలయం ఆవరణలో కనిపించిన చిత్రమిది. ఇక్కడి శిల్పకళ విభాగం విద్యార్థులు స్వయంగా రూపొందించిన ఈ చిన్నారుల బొమ్మల్ని ఎలాంటి ఆలనాపాలన లేకుండా నిర్లక్ష్యంగా వదిలేశారు

 అనకాపల్లి జిల్లా జి.మాడుగులలో మాజీ మంత్రి మత్స్యరాస మాణికుమారి ఇంటి ఆవరణలో మే పుష్పాలు కనువిందు చేస్తున్నాయి. ఈ పుష్పాలు వికసించి అటుగా వెళ్తున్న వారిని ఆకర్షిస్తున్నాయి. 

హైదరాబాద్‌ సచివాలయం వద్ద అమరవీరుల స్మృతి చిహ్నం ముందున్న వృక్షాలు పచ్చదనంతో కళకలాడుతున్నాయి. చెట్ల మధ్య నుంచి దీపం ఆకారంలోని చిహ్నం నగరవాసులను ఆకట్టుకుంటోంది.

 మెదక్‌ పట్టణం అవుసులపల్లికి చెందిన పోతాయిపల్లి సిద్ధయ్య. బాన్సువాడకు వెళ్లినపుడు ఆయన గమనించి తన ఇంటికీ సాధారణ పెంకులు తీసి.. ఇనుప రాడ్‌లు ఏర్పాటు చేశారు. ఈదురు గాలులు వీచినా, పైకప్పును కోతులు తొలగించకుండా కొన్నేళ్ల పాటు చెక్కుచెదరకుండా ఉంటదని చెప్పారు.


రెమాల్‌ తపాను తీవ్రరూపం దాల్చుతుందని ఐఎండీ చేసిన హెచ్చరికల నేపథ్యంలో కర్ణాటక పశ్చిమ తీరంలో అలజడి నెలకొంది. పరిసర జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అరేబియా సముద్రంలో అలలు పోటెత్తుతున్నాయి. వీటిని చూసేందుకు మంగళూరు శివారులోని సోమేశ్వర బీచ్‌కు సందర్శకులు తరలివచ్చారు.

సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం చౌటపల్లికి చెందిన మంద హరిప్రసాద్‌ ఏర్పాటు చేసిన ఇంకుడుగుంత ఇది. తన ఇంటి ఆవరణలో నిర్మించి అందంగా చేశారు. ఇంకుడుగుంతల ఏర్పాటుకు ప్రజల్లో ఉన్న అపోహను తొలగించి అవగాహన కల్పించేందుకే ఆకట్టుకునేలా చేశానన్నారు.

వేసవిలో చెట్లు భాష్పోత్సేకం ద్వారా నీటి వృథాను అరికట్టడానికి ఆకురాలుస్తాయి. తర్వాత కొత్తగా చిగురిస్తాయి. ఈ క్రమంలో ఆదిలాబాద్ జిల్లా బజార్‌హత్నూర్‌ మండలంలోని డేడ్రా గ్రామ సమీపంలో అడవుల్లో పక్కపక్కనే రెండు రంగుల్లో చెట్లు అలరిస్తున్నాయి.  

విద్యార్థులకు వేసవి సెలవులు ఇవ్వడంతో సరదాగా గడిపేందుకు పర్యాటక ప్రాంతాలకు వెళుతున్నారు. అందులో భాగంగా నెల్లూరు జిల్లా మైపాడు బీచ్‌కు వెళ్లి ఉత్సాహంగా.. ఉల్లాసంగా గడుపుతున్నారు. తల్లిదండ్రులతో కలిసి వెళ్లి సముద్రం నీటిలో మునుగుతూ కేరింతలు కొడుతున్నారు. 

తమిళనాడులోని నామక్కల్‌ జిల్లాలో ఉన్న కొండ మార్గంలో 70 సూది మలుపులు ఉన్నందున వాహనచోదకులకు సవాలుగా మారింది. కొన్ని మలుపుల్లో అనుభవం ఉన్న చోదకులు మాత్రమే నడపగలరు. ఈ నేపథ్యంలో దేశంలోనే అత్యంత ప్రమాదకరమైన రోడ్లలో ఒకటిగా కొల్లిమలై కొండ మార్గం నిలిచింది.

చిత్రం చెప్పే విశేషాలు (15-06-2024)

జీ7 సదస్సు.. విశేషాలివీ!

చిత్రం చెప్పే విశేషాలు (14-06-2024)

Eenadu.net Home