చిత్రం చెప్పే విశేషాలు
(31-05-2024)
తిరుమల శ్రీవారిని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా దర్శించుకున్నారు. అనంతరం అమిత్ షా దంపతులకు అర్చకులు వేదాశీర్వచనం పలికారు. ఆలయ ఈవో ధర్మారెడ్డి శ్రీవారి ప్రసాదం, చిత్రపటాన్ని అమిత్‌షాకు అందజేశారు.
తోరణాలను తలపించేలా గిజిగాడి గూళ్లు ఎంతో ఆకట్టుకుంటున్నాయి. ఖమ్మం జిల్లా పాత పాల్వంచలోని చింతలచెరువు పక్కన ఆత్మలింగేశ్వరాలయం వద్ద విద్యుత్తు తీగలకు గిజిగాళ్లు వరుసగా నిర్మించుకున్న గూళ్లను ‘న్యూస్‌టుడే’ కెమెరా క్లిక్‌మనిపించింది.
1991 డిసెంబరు 11న కన్యాకుమారిలోని వివేకానంద శిలాస్మారకం నుంచే భాజపా ఏక్తాయాత్రను ప్రారంభించింది. ఈ యాత్రకు నాయకత్వం వహించిన మురళీమనోహర్ జోషితోపాటు నరేంద్ర మోదీ కూడా ఆ చిత్రంలో కనిపిస్తున్న ఈ చిత్రం ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతోంది.
చెయ్యి తిరిగిన చిత్రకారుడు నిప్పుల కుంచెతో బొమ్మ గీసినట్టుగా ఉంది ఈ చిత్రం. కానీ ఇది ప్రకృతి విధ్వంసం తాలూకు రూపం. ఐస్‌ల్యాండ్‌లోని గ్రిండావిక్‌లో అగ్నిపర్వతం విస్ఫోటం చెంది లావా అన్ని వైపులా కొన్ని కిలోమీటర్ల దూరం ప్రవహిస్తూ ఇలా ఆకాశంలో నక్షత్ర సమూహంలా కనిపించింది.
ఎండలు మండుతున్న ప్రస్తుత తరుణంలోనూ శంషాబాద్ విమానాశ్రయ రహదారిలో పచ్చదనం కళకళలాడుతోంది. ప్రత్యేకంగా రంగురంగుల పూలు ప్రయాణికులకు స్వాగతం పలుకుతూ ఆహ్లాదం కలిగిస్తున్నాయి.
హిమాచల్‌ప్రదేశ్‌లోని శిమ్లా జాఖు ఆలయంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ తన కుమార్తె మిరాయా వాద్రాతో కలిసి పూజల్లో పాల్గొన్నారు.
శ్రీరామసాగర్ ప్రాజెక్టులో ప్రస్తుతం నీటిమట్టం తగ్గడంతో నిజామాబాద్ డొంకేశ్వర్ మండలంలోని జీజీనడ్కుడ శివారులోని గోదావరిలోని శ్రీరామలింగేశ్వరాలయం శిఖరం బయటకు కనిపిస్తోంది. కొంగలు, ఇతర పక్షులు పర్యటకులను అలరిస్తున్నాయి.
తుంగభద్ర నదీతీర గ్రామాల్లో తాగేందుకు చుక్క నీరు లేక పల్లె ప్రజలు తల్లడిల్లుతున్నారు. ఇసుకలో చిన్న గుంత తీసి అందులో నుంచి వచ్చే ఊట నీటిని బిందెల్లో తోడుకుని మోసుకెళ్తున్నారు. నందవరం మండలంలోని తుంగభద్ర నదీతీర గ్రామాల పరిస్థితి ఇది.