చిత్రం చెప్పే విశేషాలు

(03-06-2024)

ఐదో జాతీయ స్థాయి సర్ఫింగ్‌ పోటీలు అరేబియా సముద్ర తీరంలో కొనసాగుతున్నాయి. కర్ణాటక రాష్ట్రం మంగళూరు సమీపంలోని శశిత్లూ తీరం వద్ద క్రీడాకారులు అలలపై విన్యాసాలను ప్రదర్శించారు. 

చెట్లను విచ్చలవిడిగా నరుకుతున్నారు.. కానీ మొక్కలు నాటడం లేదు. ఇది ఇలాగే కొనసాగితే ప్రతీ ఒక్కరూ వీపున ఆక్సిజన్‌ సిలిండర్‌ తగిలించుకుని తిరగాల్సి వస్తుందని ఏన్కూరుకు చెందిన కొంటు సాంబయ్య ప్రధాన రహదారిపై ప్రజలకు అవగాహన కల్పించారు. 

ఆహారం కోసం పక్షులు హారంగా వలస వెళ్తున్న దృశ్యం నల్గొండ జిల్లా యాదగిరిగుట్ట సమీపంలోని వంగపల్లి చెరువు వద్ద చూపరులను కనువిందు చేసింది. ఆ దృశ్యాన్ని న్యూస్‌టుడే క్లిక్‌మనిపించింది.

 ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా 81వ జన్మదినం సందర్భంగా తమిళనాడు రాష్ట్రం పళనికి చెందిన ఉపాధ్యాయుడు అన్బుసెల్వన్‌ ఆయన సంగీతం అందించిన 1000 సినిమా పేర్లతో కూడిన చిత్రాన్ని గీసి అబ్బురపరిచారు.

ఖమ్మం జిల్లా వైరాలోని స్థానిక జలాశయంలో ఇటీవల ఈత నేర్చుకున్న చిన్నారులు, విద్యార్థులతో శిక్షకులు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. గత రెండు నెలల్లో ఈత నేర్చుకున్న సుమారు 50 మందితో ఉల్లాసంగా ఈత కొట్టారు. 

విశాఖ జిల్లా ఆర్కే బీచ్‌ తీరం పర్యటకులతో కిక్కిరిసిపోయింది. ఇసుకేస్తే రాలదన్నట్లుగా పోగైన జనాన్ని చూసి సముద్రుడు రెట్టించిన ఉత్సాహంతో అలలతో సందడి చేశాడు.

నెల్లూరు పట్టణంలోని పంచాయతీ బస్టాండ్‌ సెంటర్‌లో ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు ఆగిపోయింది. రోడ్డు మధ్యలో నిలిచిపోవడంతో ట్రాఫిక్‌ అంతరాయం కలిగింది. గత్యంతరం లేక కండక్టర్‌తోపాటు బస్టాండ్‌లో ఉన్న ప్రయాణికులంతా కలిసి నెడుతుండగా ‘న్యూస్‌టుడే’ క్లిక్‌ మనిపించింది.

గిరిజనులు గుమ్మడి కాయలను ఏడాది పొడవునా వినియోగించుకునేందుకు పురుగులు పట్టకుండా ఉండటానికి చెట్లకు వేలాడదీస్తుంటారు. వారం రోజులపాటు ఎండబెట్టి విత్తనాలను వినియోగించుకుంటారు. మిగిలిన గుమ్మడిని కూర వండుకుని తింటారు. 

చిత్రం చెప్పే విశేషాలు (15-06-2024)

జీ7 సదస్సు.. విశేషాలివీ!

చిత్రం చెప్పే విశేషాలు (14-06-2024)

Eenadu.net Home