చిత్రం చెప్పే విశేషాలు

(05-06-2024/1)

సాధారణ ఎన్నికల్లో ఎన్‌డీఏ మిత్రపక్షాల విజయం నేపథ్యంలో ఒడిశా రాష్ట్రం బ్రహ్మపురానికి చెందిన కళాకారుడు సత్యనారాయణ మహరణా మంగళవారం రాత్రి సైకత యానిమేషన్‌ తీర్చిదిద్ది ప్రధాని నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు తెలిపాడు.

మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో పవన్‌కల్యాణ్‌ను తెదేపా అధినేత చంద్రబాబు కలిశారు. ఈ సందర్భంగా పవన్‌ తనయుడు అకీరా నందన్‌ చంద్రబాబుకు పాదాభివందనం చేశారు.

ఎన్డీయే కూటమి భారీ విజయం సాధించడంతో తెదేపా అధినేత చంద్రబాబు నివాసం సందడిగా మారింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, రాష్ట్ర డీజీపీ హరీశ్‌ కుమార్‌ గుప్తా, చంద్రబాబును కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించింది. తెదేపా విజయానికి కృషి చేసిన నారా భువనేశ్వరి, బ్రాహ్మణిలకు శుభాకాంక్షలు తెలుపుతూ.. సింగర్‌ స్మిత వారితో దిగిన ఫొటోను సోషల్‌మీడియాలో పోస్టు చేశారు. 

సార్వత్రిక ఎన్నికల్లో హ్యాట్రిక్‌ విజయం సాధించిన ప్రధాని నరేంద్రమోదీకి శుభాకాంక్షలు తెలుపుతూ ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్‌ పట్నాయక్‌ పూరీ తీరంలో తీర్చిదిద్దిన సైకతం ఆకట్టుకుంటోంది. 

విజయవాడ పార్లమెంట్ స్థానం నుంచి తెదేపా తరఫున పోటీ చేసిన కేశినేని శివనాథ్ (చిన్ని) ఉండవల్లిలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను కలిశారు. మంగళగిరిలో 91వేలకుపైగా ఓట్లతో విజయం సాధించిన లోకేశ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఎమ్మెల్యేలుగా గెలిచిన అభ్యర్థులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో విజయానికి సంబంధించిన ధ్రువపత్రాన్ని జనసేన నాయకులు పవన్‌కు అందజేశారు.

సాధారణంగా మందార చెట్టు 5 నుంచి 6 అడుగుల ఎత్తు ఉంటుంది. కానీ కరీంనగర్‌ జిల్లాలోని సిరిసిల్ల బైపాస్‌ రోడ్డు దారిలో ఉన్న ప్రభుత్వ ఉజ్వల ఉద్యానంలో 12 అడుగులకు పైగా ఎత్తుతో, దాదాపు 20 అడుగుల వెడల్పుతో పెరిగిన మందార చెట్టు పర్యాటకుల్ని ఆకర్షిస్తోంది. 

నిజామాబాద్‌ జిల్లా దుబ్బ గిరిరాజ్‌ కళాశాల సమీపంలోని పెద్దమ్మ మందిరానికి కోతులు, పక్షుల బెడద ఉండటంతో రూ. 80 వేలకు పైగా ఖర్చు చేసి ఆలయాధికారులు గుడి చుట్టూ జాలి ఏర్పాటు చేశారు. 

చిత్రం చెప్పేవిశేషాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు

Eenadu.net Home