అక్షర యోధుడికి ఘన నివాళి

(09-06-2024)

రామోజీ గ్రూప్‌ సంస్థల అధినేత రామోజీరావుకు గుంటూరు జిల్లా సీతానగరానికి చెందిన సైకతా శిల్పకారుడు బాలాజీ ఘనంగా నివాళులర్పించారు. పత్రికా రంగానికి, సమాజానికి రామోజీరావు చేసిన సేవకు గుర్తుగా కృష్ణానదిలో సైకత శిల్పాన్ని ఇసుకపై రూపొందించారు. 

సంగారెడ్డి జిల్లా నారాణఖేడ్‌కు చెందిన పత్ర చిత్రకారుడు గుండు శివకుమార్‌ రావి ఆకులపై రామోజీరావు, రామోజీఫిల్మ్‌సిటీ, ఈనాడు, ఈటీవీ లోగోలను మలిచి ఘనంగా నివాళులర్పించారు.

ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లాకు చెందిన యువ కళాకారుడు బిజయ కుమార్‌ రెడ్డి సుద్దముక్కపై రామోజీరావు ఆకృతిని తీర్చిదిద్ది నివాళులర్పించారు. సుద్దముక్కపై 1.5 సెంటీమీటర్ల ఎత్తున ఆయన ఆకృతిని తీర్చిదిద్దారు.

గ్రేటర్‌ విశాఖలోని 70వ వార్డు శ్రీనివాసనగర్‌లోని ట్వింకిల్‌ స్కూల్‌ అధినేత ట్వింకిల్‌ శ్యామ్‌ ఆధ్వర్యంలో పాతగాజువాక కూడలిలో 450 అడుగుల ఎత్తైన భారీ హోర్డింగ్‌పై రామోజీరావు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు.

ఎందరో కళాకారులకు స్ఫూర్తిదాత అయిన ఈనాడు గ్రూపు సంస్థల అధినేత, పద్మవిభూషణ్‌ రామోజీరావు మృతికి నివాళిగా కరీంనగర్‌కు చెందిన రేవల్లి శంకర్‌.. రామోజీరావు సైకత శిల్పాన్ని తీర్చిదిద్ది ఘనంగా నివాళులర్పించారు.

నెల్లూరుకు చెందిన అమీర్‌ జాన్‌ , పద్మారత్నం ఆకులపై ఈనాడు గ్రూప్‌ సంస్థల అధినేత రామోజీరావు చిత్రాలను చిత్రీకరించి నివాళులర్పించారు.

ఉమ్మడి నెల్లూరు జిల్లా ఏరూరు గ్రామానికి చెందిన సైకత శిల్పి మంచాల సనత్‌కుమార్‌ రామోజీ గ్రూప్‌ సంస్థల అధినేత రామోజీరావుకు ఘనంగా నివాళులర్పించారు. 

నెల్లూరుకు చెందిన ఉమాశంకర్‌ ఆకులపై ఈనాడు గ్రూప్‌ సంస్థల అధినేత రామోజీరావు, ఈనాడు లోగోలను చిత్రీకరించి ఘనంగా నివాళులర్పించారు.

చిత్రం చెప్పేవిశేషాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు

Eenadu.net Home