చిత్రం చెప్పే విశేషాలు
(13-06-2024)
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అంతకుముందు ఆయనకు తితిదే జేఈవో గౌతమి, ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం వేదపండితులు వారిని ఆశీర్వదించి తీర్థప్రసాదాలు, స్వామివారి చిత్రపటం అందజేశారు.
తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన కేంద్రమంత్రి పీయూష్ గోయల్ దంపతులతో చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేశ్, కోడలు బ్రాహ్మణి, మనవడు దేవాంశ్ కలిశారు.
ఏపీ మంత్రిగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా రేణూ దేశాయ్ ఆయనకు శుభాకాంక్షలు చెప్పారు. ప్రమాణ స్వీకారానికి అకీరా పంచెకట్టులో వచ్చి అందరినీ ఆకర్షించారు. ఇన్‌స్టాలో అకీరా, ఆద్య ఫొటోలను పంచుకున్న రేణూదేశాయ్ తనకు వీడియో కాల్ చేసినట్లు చెప్పారు
తెలంగాణవ్యాప్తంగా జూన్ 12వ తేదీన పాఠశాలలు తెరుచుకున్నాయి. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లా కప్పర్లలో ప్రభుత్వ పాఠశాలకు వస్తున్న విద్యార్థులకు ఉపాధ్యాయులు స్వాగతం పలికారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంగ్లండ్‌లోని జాన్ వెట్‌గిఫ్ట్ అకాడమీలో సైన్స్ విద్యార్థులతో బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ముచ్చటించారు.
దిల్లీలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు
రంగురంగుల పెయింటింగ్స్, చూడముచ్చటైన ఛాయాచిత్రాలు హైదరాబాద్ మాదాపూర్‌లోని చిత్రమయి స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో కొలువుదీరాయి. చిత్రకారులు తమ మదిలో మెదిలిన భావాలను కాన్వాస్‌పై అందంగా ఆవిష్కరిస్తే... ఛాయాచిత్రకారులు చూడముచ్చటైన దృశ్యాలను తమ కెమెరాల్లో బంధించారు.
విశాఖ జిల్లా కొత్తపల్లి జలపాతంలో పర్యటకులు సందడి చేశారు. పాడేరు మోదకొండమ్మ జాతరకు వచ్చిన పలువురు భక్తులు సరదాగా స్నానాలు చేస్తూ కేరింతలు కొట్టారు.