చిత్రం చెప్పే విశేషాలు

(17-06-2024)

గతేడాది స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా హైదరాబాద్‌ మణికొండ పురపాలిక పరిధిలోని అలకాపురి కాలనీలో ఫ్రీడం పార్కు నిర్మించారు. ఉప్పు సత్యాగ్రహంలో గాంధీజీ వెంట నడుస్తున్న విగ్రహం మహనీయుడిని స్మరణకు తెస్తోంది.

విశాఖపట్నం ఎంవీపీ కాలనీలోని సాంఘిక సంక్షేమశాఖ బాలుర వసతి గృహ కార్యాలయ భవనం ఇది. 15 ఏళ్ల క్రితం రైలింజిన్‌ నమూనాలో నిర్మించిన భవనం పూర్తిగా శిథిలమైంది. ఇటీవల ఈ భవనాన్ని ఆధునికీకరించి రంగులు వేయడంతో ఇలా కళకళలాడుతోంది.

అనంతపురం జిల్లా కుందుర్పి మండలం జానంపల్లి గ్రామంలోని రైతు రామకృష్ణ పొలంలో అతి పెద్ద పుట్టగొడుగు లభ్యమైంది. 5 కిలోల బరువు, రెండు అడుగుల వెడల్పుతో ఆకట్టుకుంది.  

వరంగల్‌ జిల్లా చెన్నారావుపేట మండలం తిమ్మరాయినిపహాడ్‌ గ్రామానికి చెందిన నాగోతు బాలజోజి .. బాపూజీపై తనకున్న అభిమానాన్ని చాటుకునేలా ఇంటి ప్రహరీపై రూ.30 వేల వ్యయంతో గాంధీ విగ్రహాన్ని ఏర్పాటుచేసి ఆదర్శంగా నిలిచారు.

తమిళనాడు రాష్ట్రం కన్యాకుమారిలో కొన్ని రోజులుగా సముద్రం కల్లోలంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో సంగుతురై సముద్రతీరంలో రాకాసి అలలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం పెద్దపల్లి గ్రామానికి విద్యుత్తు సౌకర్యం లేదు. ఇళ్లలో విద్యుత్తు సౌకర్యం లేకపోవడంతో చరవాణులకు ఛార్జింగ్‌ పెట్టేందుకు గ్రామవాసులు ఇలా ఇంటి పైకప్పుపై సౌరఫలకాలు ఏర్పాటు చేసుకున్నారు.

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌కు చెందిన దస్తగిరి.. హైదరాబాద్‌లోని కింగ్‌కోఠిలో నారాయణ సేవా సంస్థాన్‌ నిర్వహించిన ‘కృత్రిమ అవయవాల’ శిబిరానికి తన కుమారుడిని తీసుకొచ్చాడు. అక్కడ కృత్రిమ కాళ్లు పెట్టించి ఇలా చేతులపై తీసుకెళ్తున్న చిత్రం ‘ఈనాడు’కు కనిపించింది. 

వేసవికాలంలోనే మనకు కనిపించే మే పుష్పం జూన్‌ నెలలోనూ విరబూస్తోంది. సాధారణంగా ఒకటి రెండే పూస్తాయి. కానీ ఆదిలాబాద్‌ పట్టణం ద్వారకానగర్‌లో నివాసముండే విశ్రాంత ఎంఈఓ కారెంగుల దామోదర్‌ నివాసంలో ఇలా ఆరు పుష్పాలు పూసి అందరిని ఆకట్టుకుంటున్నాయి. 

అత్యాధునిక కెమెరాలతో.. చుట్టూ ఉన్న దారులన్నింటినీ చిత్రీకరిస్తూ భూమార్గాన్ని సర్వే చేస్తున్న ఈ వాహనం హైదరాబాద్‌లోని బాచుపల్లిలో కనిపించింది. భారీ కెమెరాలతో ఉన్న ఈ వాహనం కాలనీల్లో తిరుగుతుంటే జనం ఆసక్తిగా తిలకిస్తున్నారు.

రాజస్థాన్‌ నుంచి ఉపాధి కోసం వలస వచ్చిన యువకుడు వీధుల్లో తిరుగుతూ కుర్చీలు విక్రయిస్తున్నాడు. తలపై 11, భుజానికి 3 కుర్చీలతో హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్‌లో దారిలో ఇలా కనిపించాడు.

చిత్రం చెప్పేవిశేషాలు

స్ఫూర్తి నింపే ఆసక్తికర విషయాలు

చిత్రం చెప్పేవిశేషాలు

Eenadu.net Home