అంతర్జాతీయ యోగా దినోత్సవం

(21-06-2024)

శ్రీనగర్‌లోని డాల్‌ సరస్సు సమీపంలో నిర్వహించిన 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొని యోగా చేశారు.

శ్రీనగర్‌లోని డాల్‌ సరస్సు సమీపంలో నిర్వహించిన 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరయ్యారు. ఈసందర్భంగా అక్కడ మహిళలు, యువతీయువకులతో సెల్ఫీ దిగారు.

యోగా సాధన అనేది శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శ్రేయస్సుకు ఒక మార్గమని, ప్రతిఒక్కరూ తమ జీవితంలో యోగాను అంతర్భాగం చేసుకోవాలని రాష్ట్రపతి ద్రౌపదీముర్ము సూచించారు. అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు.

నటి, మధుర ఎంపీ హేమామాలిని ఉత్తర్‌ప్రదేశ్‌లోని మథురాలో యోగా దినోత్సవంలో పాల్గొని యోగా చేశారు. 

కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఉత్తర్‌ప్రదేశ్‌లోని మథురాలో సైనికులతో కలిసి యోగా చేశారు.

హైదరాబాద్‌లోని నిజాం కాలేజీ గ్రౌండ్స్‌లో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, భాజపా రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్‌ పాల్గొన్నారు.

హైదరాబాద్‌లోని సంజీవయ్య పార్కులో నిర్వహించిన యోగా కార్యక్రమంలో తెలంగాణ మంత్రి దామోదర రాజనర్సింహ పాల్గొని యోగా చేశారు.

తెలుగు రాష్ట్రాల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ఔత్సాహికులు యోగాసనాలు వేశారు. 

అలవాటుగా మారిందేదీ కష్టంగా అనిపించదు

చిత్రం చెప్పే వార్తలు (21-10-2024)

మీ జీవితపు స్టీరింగును వేరొకరికి ఇవ్వొద్దు

Eenadu.net Home