చిత్రం చెప్పే విశేషాలు

(22-06-2024)

హైదరాబాద్‌లోని హైటెక్‌సిటీలో హైలైఫ్‌ ఎగ్జిబిషన్‌ను ఘనంగా ప్రారంభించారు. మూడు రోజుల పాటు ఈ ఎగ్జిబిషన్ జరగనుంది. ఎగ్జిబిషన్‌ ప్రారంభోత్సవంలో మిస్‌ ఇండియా వరల్డ్‌-2023 నందినీ గుప్తా, నటి దోనాల్‌ బిస్త్‌, మోడల్స్‌ పాల్గొని సందడి చేశారు. 

తిరుమల శ్రీవారి ఆలయంలో మూడు రోజులపాటు జరిగిన జ్యేష్ఠాభిషేకం ఘనంగా ముగిసింది. చివరి రోజున ఉభయ దేవేరులతో కలిసి శ్రీ మలయప్పస్వామి వారు బంగారు కవచంలో పునఃదర్శనమిచ్చారు. తిరిగి జ్యేష్ఠాభిషేకం వరకు సంవత్సరం పొడవునా స్వామి, అమ్మవార్లు ఈ బంగారు కవచంతో ఉంటారు.

మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ మున్సిపాలిటీలో ప్రతి శుక్రవారం సంత జరుగుతుంది. వివిధ గ్రామాల నుంచి అమ్మకందారులు, కొనుగోలుదారులు పెద్దఎత్తున తరలివచ్చారు. సంత జరుగుతుండగా, ఎక్కడి నుంచో కొండముచ్చు కూరగాయలు విక్రయించే చోటుకు వచ్చి దర్జాగా కూర్చుంది.

ఫ్రాన్స్‌కు చెందిన విలాసవంత కార్ల తయారీ సంస్థ బుగాటీ ఆటోమొబైల్స్, తోబియాన్‌ హైపర్‌-జీటీ హైబ్రిడ్‌ కారును ఆవిష్కరించింది. 40 మిలియన్‌ డాలర్ల (సుంకాలు కాకుండా సుమారు రూ.34 కోట్ల) ధర పలికే ఈ అత్యాధునిక కారుకు 8.3 లీటర్‌ వీ16 ఇంజిన్‌ అమర్చారు.

యాదాద్రిభువనగిరి జిల్లా సంస్థాన్‌ నారాయణపురం మండలంలోని పల్లగట్టుతండాలో పిల్లలు లేకపోవడంతో పన్నెండేళ్ల కిత్రం సర్కారు బడిని గ్రామ పంచాయతీ కార్యాలయంగా మార్చారు. ఓ పక్క కార్యదర్శి విధులు నిర్వహిస్తుండగా.. బడి బాట కార్యక్రమంలో భాగంగా అదే గదిలో మరో పక్క విద్యార్థులకు బోధన చేశారు. 

నరసాపురం నియోజకవర్గ జనసేన ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్‌ అసెంబ్లీ వద్ద ప్రత్యేకంగా కనిపించారు. ఆయన మత్స్యకారుడి వేషధారణలో వల, చేపల బుట్ట పట్టుకుని కూడలి నుంచి అసెంబ్లీ ప్రవేశద్వారం వరకు నడుచుకుంటూ వచ్చారు. 

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా తెదేపా, జనసేన, భాజపా, వైకాపా, ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. సీఎం చంద్రబాబు నేలకు మొక్కిన తర్వాత శాసనసభలోకి అడుగుపెట్టారు..

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా తెదేపా, జనసేన, భాజపా, ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. సభలో ‘నిజం గెలిచింది.. ప్రజాస్వామ్యం నిలిచింది’ అంటూ మంత్రులు అచ్చెన్నాయుడు, లోకేశ్, రామానాయుడు, ఎమ్మెల్యేలు ప్లకార్డులు ప్రదర్శించారు.

గుంటూరు జిల్లా పిట్టలవానిపాలెం శ్రీసీతారామస్వామి వారి దేవస్థానంలో జ్యేష్టాభిషేక మహోత్సవంలో భాగంగా స్వామివారికి పుష్పయాగం నేత్రపర్వంగా నిర్వహించారు. స్వామివారికి పుష్పాలతో చేసిన అలంకరణ ఆకట్టుకుంది. భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. 

కాకినాడ నగర శివారులో ఉన్న ప్రాంతాల ప్రజలు తాగునీటికి తిప్పలుపడుతున్నారు. ఎంఎస్‌ఎన్‌ ఛారిటీస్‌ ప్రాంతం, డ్రైవర్స్‌ కాలనీ, పగడాల పేట తదితర ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా తాగునీరు సరఫరా చేస్తున్నారు. కేవలం ఒక్క ట్యాంకర్‌ మాత్రమే వస్తుండటంతో నీటి కోసం ఎగబడుతున్నారు.

శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా పౌర్ణమి పూజలు ఘనంగా జరిగాయి. దేవాలయాల్లో శుక్రవారం దేవతామూర్తులకు అభిషేకం, విశేష అలంకరణ పూజలు నిర్వహించారు. బలగ కాలభైరవాలయంలో బాలత్రిపుర సుందరి అమ్మవారికి  అభిషేకం చేశారు. 

అలవాటుగా మారిందేదీ కష్టంగా అనిపించదు

చిత్రం చెప్పే వార్తలు (21-10-2024)

మీ జీవితపు స్టీరింగును వేరొకరికి ఇవ్వొద్దు

Eenadu.net Home